ఈ ఏడాది వెలిగొండ పూర్తి
డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి హర్షం
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు సహా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఈ ఆర్ధిక సంవత్సరంలోపు పూర్తిచేస్తామని శాసనసభలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తిచేస్తామని చెప్పడంతో ప్రకాశం జిల్లా వాసులలో ఆనందం నెలకొన్నదని అన్నారు. దశాబ్దాల కల వచ్చే ఏడాదికి సాకారం అవుతుందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టే వెలిగొండ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ప్రభావిత నిర్వాసితులను ప్రభుత్వం గుర్తించే పనిలో పడిందన్న ఏలూరి రామచంద్రారెడ్డి నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని ఇవ్వడానికి రూ. 1000 కోట్లు కేటాయించిన విషయాన్నీ గుర్తుచేశారు. గతేడాది వెలిగొండ ప్రాజెక్టుకు యొక్క మొదటి టన్నెల్ నిర్మాణం పూర్తయిందన్న ఏలూరి రెండో టన్నెల్ కు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. ఈ ఏడూ వెలిగొండ పూర్తయితే తరతరాల మా కష్టాలు తీరతాయని ఆశిస్తున్నామని.. ప్రాజెక్టు పూర్తయ్యే క్షణాలకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నామని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు.
Post A Comment:
0 comments: