ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు,,,
సావిత్రీ బాయి పూలే క్రాంతి జ్యోతి అవార్డు
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ సేవలకు తెలంగాణ వరంగల్ మహిళా సాధికార ఫౌండేషన్ వారు సావిత్రీ బాయి పూలే క్రాంతి జ్యోతి ప్రశంసా పురస్కారాన్ని అందించారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ గత 20సంవత్సరాలు గా దాదాపు 54సార్లు రక్తదానం చేశారు వందలాది రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు టిప్పు సుల్తాన్ మానవతా రక్త దాన సంఘం లో వెయ్యి మంది రక్త దాతలు అనునిత్యం అత్యవసర సమయాల్లో శస్త్ర చికిత్సలకు కాన్పులకు రక్తదాన కార్యక్రమాలు చేస్తూ.
అనాధ శవ అంత్యక్రియలు కోవిడ్ రోగులు కరోనా తో మరణించి అంత్యక్రియలకు ముందుకు రాకపోతే ఉదయ్ లైఫ్ వరల్డ్ మిత్రబృందం టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ టిప్పు బ్రిగేడ్ సభ్యులు మిత్ర బృందం సహకారం తో వందకు పైగా కోవిడ్ బాధితుల అంత్యక్రియలలో కుల మతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహించారు మరియు సహకారాన్ని అందించారు గతంలో దాదాపు 15కు పైగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు తీవ్రవాద వ్యతిరేక .మత సామరస్య. సోదర భావ. జాతీయ సమైక్యత చైతన్య కార్యక్రమాలు దేశభక్తి కార్యక్రమాలు అనేక నిర్వహించారు ఈ విషయాలు పరిశీలించిన మహిళా సాధికార ఫౌండేషన్ చైర్మైన్ దామ రజనీ రుద్రమ ఉమర్ ఫారూఖ్ ఖాన్ సేవలను గుర్తించి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పోస్ట్ ద్వారా అవార్డును అందజేశారు. పుర ప్రముఖులు ప్రశంసించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: