ఆ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలి

ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కరోనా పేరుతో దోచుకుంటున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఉచిత వైద్యం అందించాలని, కరోనా సెకండ్ వేవ్ పేరుతో దోచుకుంటున్న అన్ని కరోనా హాస్పిటల్స్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే ఉచిత వైద్య సేవలు అందించాలన్నారు. నంద్యాల సీపీఐ కార్యాలయంలో జరిగిన ఎఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో నాగ రాముడు మాట్లాడుతూ కరోనా పేరుతో రాష్ట్రంలో ఉన్న అన్ని కోవిడ్ హాస్పిటల్స్ కూడా బెడ్స్ లేవనే సాకుతో వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒక వేల డబ్బులు కట్టిన కూడా ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారని, ఇలా కరోనా పేరుతో హాస్పిటల్స్ చేస్తున్న మాఫియాకు తక్షణమే ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలన్నారు. అంతే కాకుండా ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు కేవలం దానార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ

పేద ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బున్న,పరపతి ఉన్న,రేకమెన్డేషన్ ఉన్న వాళ్ళకే బెడ్స్ ఇస్తున్నారని,ఎక్కడ చూసినా  కరోనా హాస్పిటల్స్ లో ఇలా చాలా రకాలుగా సరైన వైద్యం అందక పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని,ఇంకా కొన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ఉన్న కూడా ఆక్సిజన్ లేదని ఆక్సిజన్ పెట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నదని డబ్బు ఉన్నవారికి మాత్రమే ఆక్సిజన్ ఇస్తున్నారని ఇలా కోవిడ్-19 హాస్పిటల్స్ యాజమాన్యాలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తూన్నాయని కావున తక్షణమే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ కరోనా కష్టకాలమంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు అడ్డుకట్ట వేయాలంటే తక్షణమే ఉచిత పథకాలు కాకుండా ఈ 6 నెలల పాటు ఉచిత వైద్యం రాష్ట్రంలో అమలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని,రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకొని కరోనా రోగులకు తక్షణ సహాయాన్ని అందించేలా చర్యలు తీసులోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర నేత నాగరాముడు డిమాండ్ చేశారు. ఈ  సమావేశంలో నంద్యాల పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య, విష్ణు, నాయకులు సురేశ్, రమణ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: