రాజీవ్ గాంధీ బలిదానము వృధా కావద్దు

దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం

జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమితి అధ్వర్యములో చారిత్రాత్మక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనముగా నివాళులర్పించారు. కోవిద్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో పాల్గొని దివంగత నేతను సంసర్మించుకున్నారు. రెండు నిముషాలు మౌనము పాటించి దివంగత నేతకు శ్రద్దాంజళి ఘటించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ 1990 సంవత్సరము అక్టోబర్ 19న ,చార్మినార్ నుండే కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగుర వేసి జంట నగరాలలో తన సద్భావన యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక సమితి అధ్యక్షులు జి.నిరంజన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ తన కొద్ది పాటి రాజకీయ జీవితంలో దేశాభివృద్ధికి చేసిన సేవలు అమోఘమన్నారు. యువతకు 18 యేళ్ల వయస్సుకే ఓటు హక్కు కల్పించడము, నేరుగా గ్రామాలకే నిధులు లభించే విధముగా చట్టాల మార్పుకు సంకల్పించడము. టెక్నాలజీ అభివృద్ది, టెలికమ్యూనికేషన్ రంగములో విప్లవాత్మక మార్పులతో ఆ సేవలను ఊరూర ప్రజల అందుబాటులోకి తేవడము, ఆయన ఘనతేనన్నారు. ఈ దేశ సమగ్రతకు, పటిష్టతకు, అభివృద్దికి, తీవ్రవాద శక్తుల నుండి రక్షించడానికి కృషి చేస్తూ, పిన్న వయసులోనే బలి అయ్యారు. ఆయన బలిదానము వృధా కావద్దు. దేశము రాజకీయ స్వార్థపరుల గుప్పెట్లో , ప్రజలు కరోనా గుప్పెట్లో విలవిల లాడుతున్న ఈ తరుణములో ప్రజలు చైతన్యముతో ముందుకు కదిలి తమను తాము రక్షించుకోవడమే కాకుండా స్వార్థ రాజకీయ శక్తుల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించు కోవాలన్నారు.

ఇదిలావుంటే ఎ.ఐ.సి.సి మరియు పి.సి.సి ఆదేశాల మేరకు కార్యక్రమానంతరము పేట్లాబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లో అడ్మిట్ అయి ఉన్న 300 మంది మహిళలకు పలు రకాల పళ్లు, బిస్కెట్టులు, జ్యూస్, గుడ్లు ఉన్న కిట్లను స్మారక సమితి తరపున జి. కన్నయ్యలాల్, జి. దినేశ్ మరియు పి. రాజేశ్ కుమార్ లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమణి, సూపర్వైజర్ షేక్ ఉస్మాన్ కు అందజేశారు. శాలిబండలోని సూరజ్ భాన్ హాస్పిటల్ లో కూడా 60 కిట్లను అడ్మిట్ అయి ఉన్న మహిళలకు అందజేశారు. పి.సి.సి.కార్యదర్శులు సయ్యద్ యూసుఫ్ హాష్మీ,, జి.కన్నయ్యలాల్, పి.సి.సి.ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పి. రాజేశ్ కుమార్, నగర కాంగ్రెస్ నాయకులు ముజాహిద్, మూసా ఖాసిం, జి. దినేశ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: