దారిలోకి రాకుంటే,,,

ఆ ఆసుపత్రులను స్వాధీనం చేసుకోండి

సీఎంకు కాంగ్రెస్ నేత జి.నిరజంన్ లేఖనిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనము చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి మెయిల్ ద్వారా ఓ లేఖ పంపారు. ఆ లేఖలోని సారాంశం ఇలావుంది. రాష్త్రములో ప్రైవేట్ ఆసుపత్రుల వారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని 88 పిర్యాదులు వస్తే, 64 ఆసుపత్రులకు నోటిస్ లిచ్చామని, ఒక ఆసుపత్రి గుర్తింపు రద్దు చేశామని నిన్న ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రశ్రీనివాసరావు గారు తెలిపారు. ఎన్ని సార్లు ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి కోరినా, హెచ్చరికలు జారీ చేసినా వారికి చీమ కుట్టినట్టయినా లేదు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని వెళ్లుతున్న వారి వద్ద యధావిధిగా అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దిక్కు తోచని పరిస్థితి లోకి నెట్టేస్తున్నారు. ఆసుపత్రి, డాక్టర్ అంటే వైద్యము చెయడానికని కాకుండా డబ్బు గుంజటానికే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్తితిలో ప్రజలు విలవిల లాడుతుంటే వారు నిర్లక్ష్యంగా భాధ్యతా రహితముగా మానవత్వము లేకుండా ప్రవర్తిస్తున్నందున మీరు క్రింద పేర్కొన్న కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనము కల్గించాలని కోరుతున్నాము. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక సారి నోటీసు ఇచ్చినా, నడవడిక లో మార్పు లేకుంటే ప్రభుత్వం వాటిని స్వాధీనము చేసుకుని నడిపించాలి. అవసరమైతే చట్ట సవరణలు చేయాలి. ఇలా స్వాధీనము చేసుకున్న ఆసుపత్రుల నిర్వహణకు ముఖ్యమంత్రి అధ్వర్యములో నిష్టాతులైన రిటైర్డ్ ధికారులు మరియు వైధ్యాధికారులతో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అందులో ఉన్న డాక్టర్లను, సిబ్బందిని ఆలాగే కొనసాగిస్తూ ప్రభుత్వ నియంత్రణలో సేవలు కొనసాగించాలి. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి, రోగుల నుండి వసూలు చేసే బిల్లు వివరాలను ఆన్ లైన్ లో పెట్టే విధంగా కట్టడి చేసి, వైద్య ఆరోగ్య శాఖ లో ఒక సెల్ ఏర్పాటు చేసి నిరంతరము పర్యవేక్షిస్తు, ఈ దోపిడిని అరికట్టాలి మీ సత్వర చర్యలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతాయి. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: