పోలీసన్న కంటిరక్షణకు....

కోవిడ్ కళ్ళ అద్దాలు పంపిణీ


అద్దాలను సిఐకు అందిస్తున్న ఎంఐఎం అధ్యక్షులు అక్బర్ హుస్సేన్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

వేసవికాలం, వర్షాకాలం, చలికాలం... ఏ కాలమైనా మొక్కవోని ధైర్యంతో ప్రజా సేవ అనుకునే వారే ట్రాఫిక్ పోలీసులు. ప్రధాన కూడళ్లవద్ద గంటలకొద్దీ నిలబడుతూ నొప్పులను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తుంటారు. సెంటర్లలో నలు వైపులనుంచి వాహనాల శబ్దాలు, ప్రజల శాపనార్థాలు పెడుతున్నా డ్యూటీనే పరమావిధిగా రోడ్లకే పరిమితమైన ట్రాఫిక్ పోలీసన్నలకు కరోనా వైరస్ నుంచి కళ్ళను కాపాడుకునేందుకు ఎంఐఎం పార్టీనాయకులు కరోనా అద్దాలు పోలీసులకు పంచారు..కరోనా సెకెండ్ వేవ్ ప్రజలు ఊహించని విధంగా విలయతాండవం చేస్తుంది. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు కేటాయించిన సమయంలో వారికి అవసరమైన వస్తువులు కొనడానికి రోడ్లపై విచ్చలవిడిగా వస్తున్నారు. వాహనాల వేగం, వేసవి తాపం, దుమ్ము, ధూళితో ట్రాఫిక్ పోలీసులు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకాన్ని నంద్యాల ఎంఐఎం అధ్యక్షులు అక్బర్ హుస్సేన్ చూసి చలించిపోయారు. ట్రాఫిక్ పోలీసులకు కంటికి రక్షణగా ఏదైనా చేయాలని తెలిసిన వైద్యులను సంప్రదించడంతో వైద్యుల సూచనల మేరకు కరోనా నుంచి కంటి రక్షణ అద్దాలను అందించారు.

ట్రాఫిక్ సిఐ ప్రభాకర్ రెడ్డికి 10 వేలు విలువచేసే 50 అద్దాలను అందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సిబ్బంది కరోనా సమయంలో దుమ్ము, దూళితో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని సమస్యను గుర్తించి అద్దాలను పంపిణీ చేసిన అక్బర్ ను అభినందించారు. ఈ సందర్భంగా అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రాణాలకు లెక్కచేయకుండా కరోనా విపత్తులో ట్రాఫిక్ పోలీసులు పడుతున్న ఇబ్బందులు గమనించి ఉడతాభక్తిగా చిన్న సహాయం చేశానన్నారు. ఈ కార్యక్రమంలో సమీర్, అయూబ్, మహమ్మద్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: