రుయా ఘటనపై విచారణ జరిపించాలిబి
జెపిెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానో జాగో వెబ్ న్యూస్- విజయవాడ ప్రతినిధి)
తిరుపతిలోని రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 11 మంది మృత్యువాత పడిన ఘటనపై విచారణ జరిపించాలని బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ బాషా డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కావున ఈ ఘటనపై విచారణ జరిపించి నిజానిజాలు వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రుయా ఘటనను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా ఆక్సిజన్ సరఫరా లో కొరత రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Post A Comment:
0 comments: