అసంఘటిత కార్మికులకు వరం

అటల్ పెన్షన్ యోజన పథకం

రూ.7 పొదుపుతో ప్రతి నెలా చేతికి రూ.5 వేలు!


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ ప్రతినిధి)

వయస్సు ఉన్నంతవరకే ఏదైనా..? అందుకే వయస్సు పై బడితే తమ జీవనం సాగేదెలా అన్నది అందరిలోనూ ఉండే బెంగ. ప్రభుత్వ ఉద్యోగి అయితే అతడికి పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఒకవేళ కొత్త వారికి అది లేకపోయినా ఓ సారి పెద్ద మొత్తంలో డబ్బలు అందుతాయి. కాబటి ఎలాంటి దిగులు ఉండదు. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు, అసంఘటిత రంగంలో పనిచేస్తే వారి పరిస్థితి ఏమిటీ..అందుకే వారి కోసం కేంద్రం ఓ కొత్త పథకం తీసుకొచ్చింది. ఇందుకోసం మీకు ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో చేరితే ప్రతి నెలా రూ.5 వేల వరకు పొందొచ్చు. దీని కోసం మీరు నెలకు రూ.210 కట్టాలి.


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరితే ప్రతి నెలా డబ్బులు లభిస్తాయి. అసంఘటిత రంగంలోని వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. పీఎఫ్ఆర్‌డీఏ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. ఆధార్‌ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా ఇతర ప్రాంతీయ బ్యాంకులు కూడా అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను తెరుస్తాయి. ఈ పథకంలో చేరిన వారు నెలకు రూ.1000 నుంచి రూ.5 వేలు పొందొచ్చు. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.210 చెల్లిస్తే రూ.5 వేలు వస్తాయి. అంటే మీరు రోజుకు రూ.7 ఆదా చేసినా సరిపోతుందని చెప్పుకోవచ్చు. అదే రూ.1000 కావాలంటే నెలకు రూ.42 కడితే సరిపోతుంది. రూ.2000 వేల పెన్షన్ కోసం రూ.84 చెల్లించాల్సి ఉంటుంది. రూ.3 వేల కోసం రూ.126 కట్టాలి. రూ.4 వేల పెన్షన్ కోసం రూ.168 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా డబ్బులు వస్తాయి. మీరు ఎం మొత్తం పెన్షన్ తీసుకోవాలనే అంశం మీరు చెల్లించే నెలవారీ మొత్తం ప్రాతిపదికన మారుతుంది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: