మే 30వ తేదీ ఏపీ ప్రజల జీవితాల్లో,,,

వెలుగు నింపిన రోజు

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఈ నెల 30వ తేదికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ కు అభినందనలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి. ఈ రెండేళ్ల కాలంలో పదేళ్లకు సరిపడా అభివృద్ధి, సంక్షేమం చేపట్టారని కొనియాడారు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు జగన్ చేసిన సాయం మరువలేనిదని అన్నారు.. అన్న మాట ప్రకారమే పాలన సాగిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేసుకున్నారని ఏలూరి అన్నారు.
పాలనను క్షేత్రస్థాయి వరకూ చేర్చి... అవినీతికి అడ్డుకట్టవేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం కూడా కలిగేలా చేశారని చెప్పారు. ప్రజలు కోరిన పాలన అందించడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందవచ్చనే కీలక సూత్రాన్ని జగన్ గుర్తించగలిగారని అన్నారు. తన తండ్రి ఆకస్మిక మరణానంతరం  కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో మోసపోయినా వెన్ను చూపకుండా తనదైన శైలిలో సుమారు పదేళ్ల పాటు శ్రమించి, ఆ తర్వాత తగిన ఫలం అందుకున్నారని అన్నారు. జగన్ జీవన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఏలూరి అన్నారు. ఎంచుకున్న దారిలో తీవ్రమైన ఆటుపోట్లు ఎదురవుతాయని తెలిసినా ఇచ్చిన మాటకోసం, తండ్రి ఆశయాలకోసం చేసిన పోరాటాన్ని ఏపీ ప్రజలు వృధా కానీయలేదని అన్నారు. మే 30వ తేదీ ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన రోజు.. ఆరోజు కోసం పదేళ్లుగా వేయికళ్లతో ఎదురుచూశామని ఏలూరి చెప్పారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే జగన్ లాంటి నాయకుడు కలకాలం వర్ధిల్లాలి అని ఏలూరి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: