సంక్షోభంలోనూ...

రూ.2 లక్షల 29 వేల కోట్లతో భారీ బడ్జెట్

సంక్షేమానికి పెద్దపీట

వ్యవసాయం...విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రత్యేక ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఇదిలావుంటే తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్‌ బడ్జెట్‌ తెచ్చింది.

 

►2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు

►రెవెన్యూ వ్యయం - రూ.లక్షా 82 వేల 196 కోట్లు

►మూలధన వ్యయం - రూ.47,582 కోట్లు

►రెవెన్యూ లోటు - రూ.5 వేల కోట్లు

►ద్రవ్యలోటు - రూ.37,029.79 కోట్లు

►జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం

►రెవెన్యూ లోటు 0.47 శాతం

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా

బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు

ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు

ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు

కాపు సంక్షేమం: రూ.3,306 కోట్లు

ఈబీసీ సంక్షేమం: రూ.5,478 కోట్లు

బ్రాహ్మణ సంక్షేమం: రూ.359 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌: రూ.1,756 కోట్లు

చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు

మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు

వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు


విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు

వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు

వైఎస్సార్‌ పింఛన్‌ కానుక: రూ.17 వేల కోట్లు

వైఎస్సార్‌ రైతు భరోసా: రూ.3,845 కోట్లు

జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు

జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు

వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా: రూ.1802 కోట్లు

డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు

పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు

వైఎస్సార్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు

వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు

మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు

రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు

లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు

ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు

అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు

వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు

రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

రైతన్నకు వరాలు

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన 2021-22 బడ్జెట్‌ లో రైతన్నకు వరాలు ప్రకటించారు. అన్నదాతకు అన్నీ తానై వారికి అడుగడుగునా అండగా ఉంటూ ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వంగా ముందుకు సాగుతోందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నం పెట్టే రైతన్నకు తోడ్పాటుగా నిలిచి భూమిపుత్రుల రుణం తీర్చుకుంటున్నామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

విద్యా రంగానికి రూ.24,624 కోట్లు

పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతారు. రాష్ట్ర విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి సంబంధించిన కేటాయింపులతో ఈ విషయం మరోమారు స్పష్టమైంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా.. పాఠశాలల్లో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు, జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించారు. కాగా గత బడ్జెట్‌లో ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

2021-22 వార్షిక బడ్జెట్‌:

విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు

స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు

జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు

జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు

ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: