పేద మైనార్టీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి

100 మందికి ఈద్ కిట్లు పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రంజాన్ పండుగకు పేద మైనార్టీ కుటుంబాలు ఆనందంగా వుండాలని ఈద్ కిట్లు పంపిణీ చేసినట్లు ఎంఐఎం అధ్యక్షులు అక్బర్ హుస్సేన్ పేర్కొన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పేద ప్రజలను గుర్తించి 100 మందికి రంజాన్ ఈద్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రెండేళ్లుగా ఇసుక దొరకకపోవడం, గత ఏడాది,ఈ ఏడాది కరోనాతో పేద ప్రజలు పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారని,  రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని కొందరికైనా సహాయం చేయాలని ఈద్ కిట్లను పంపిణీ చేశానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: