ప్రాణాలు పోతుంటే అంతా సజావుగా ఉన్నట్లా

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రాష్ట్రంలో ఒక్క రోజులో 10,122 కరోనా పాజిటివ్ కేసులు 52 మరణాలు సంభవిస్తే, రాష్ట్రములో కరోనా కేసులు అంతగా పెరుగడము లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించడం శోచనీయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ పేర్కొన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈ సందర్భంగా జి.నిరంజన్ మాట్లాడుతూ...  ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్షిజన్ కొరత లేదని ప్రపంచములో ఎక్కడా లేని విధముగా విమానాలలో ఆక్షిజన్ ట్యాంకర్లను తెప్పిస్తున్నామని గొప్పలు చెప్పే బదులు ప్రవేట్ ఆసుపత్రులను నియంత్రించి ప్రజలు దోపిడీకి గురికాకుండా చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాదు, ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఎటువంటి కొరత, అసౌకర్యాలు కలుగకుండా చూడాల్సిన భాధ్యత ప్రభుత్వానిది. రాష్ట్రములో వెంటిలేటర్ బెడ్ల కొరత తీవ్రంగా ఉన్నది.ఆ కొరత లేకుండా చూడాలి. అసలుకు ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనే సమర్తతా ఈ ప్రభుత్వానికి ఉందా? అనే సందేహము కలుగుతుంది. ప్రజలను అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వము కె.సి.ఆర్ ప్రభుత్వము అని చెప్పే ఈటల ఎందుకు కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్పించలేక పోతున్నారో చెప్పాలి. ముఖ్య మంత్రి కె.సి.అర్ భజన తప్ప ప్రజల రోదనలు వినపడవా..? వాస్తవాలను అంగీకరించి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తము చేసి ప్రజలను ఆదుకోవాలి తప్ప ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలు చేసి విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: