ఆ ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేయాలి...
ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు యు.నవీన్ కుమార్ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ పేషంట్ల నుండి అధిక ఫీజులు డిపాజిట్ చేయించుకున్న ప్రయివేట్ హాస్పెటల్ యాజమాన్యల అక్రమాలను అరికట్టి వారి హాస్పిటల్ లైసెన్స్ లను రద్దుచేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా నాయకులు యు నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నందికొట్కూరు లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండోదశ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు యాజమాన్యం మొత్తం సిండకెట్ అయ్యి కరోనా సోకినా వారివద్దనుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అయిన పేషంట్స్ వద్దనుండి మూడు లక్షలు డిపాజిట్స్ కట్టాలి లేకపోలేతే మావద్ద బెడ్స్ కాలి లేవు అంటూ దందాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజులను ప్రతి హాస్పిటల్ యాజమాన్యం నోటీసు బోర్డులో తెలియజేయాలన్నారు. అదేవిధంగా టెస్టులో పేరుతో స్కానింగ్ సెంటర్ లో మూడు వందలు వసూలు చేయాల్సి ఉంటే మూడు వేల పైగా వసూలు చేస్తూన్నా జిల్లా అధికారులు చోద్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలు గాలికి వదిలి ఆరోగ్యశ్రీ పేషంట్ల వద్ద అధిక ఫీజుల వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఫైన్లతో సరిపెట్టకుండా వాటి గుర్తింపును రద్దుచేయాలన్నారు. ఆరోగ్యశ్రీ క్రింద అడ్మిట్ అయిన ఏ ఒక్క పేషంట్ వద్ద ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం - 2005 నిబంధనల వున్న సంబందిత ఆస్పత్రుల యాజమాన్యం అక్రమాలకూ పాల్పడుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం వెనుక వున్న ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు. జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ పేషంట్లకు పటిష్టంగా వైద్య సేవలు అందాలంటే జిల్లాలోని కోవిడ్ వైద్యం అందించే అన్ని ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలి అప్పుడే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ నాయకులు మధు, అఖిల్,వినోద్ మొదలైన వారు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: