స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన బందోబస్తు

ప్రకాశం జిల్లా కలెక్టర్

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పరిసరాలను పరిశీలిస్తున్న  ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్.

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)              

             మార్కాపురం, గిద్దలూరు జెడ్.పి.టి.సి మరియు ఎం.పి.టి.సి ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మార్కాపురం పట్టణంలోని జెడ్.పి.టి.సి మరియు ఎం.పి.టి.సి ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ మరియు కౌంటింగ్ హాల్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ మార్కాపురం, గిద్దలూరు జెడ్.పి.టి.సి,ఎం.పి.టి.సి ఎన్నికలకు సంబంధించిన  బ్యాలెట్ బాక్స్ లను కమలా కాన్సెప్ట్ స్కూల్ ,కమలా ఎం.బి .ఎ కాలేజీ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ లో భద్ర పరచడానికి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సి.సి కెమేరాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. అలాగే భద్రతా దృష్టా ఆర్మ్డ్ పోలీసు బలగాలను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎన్నికల మోనిటరింగ్ ఆఫీసర్ వసంత్ బాబు,ఎంపీడీఓ హనుమంతరావు, తహసీల్దార్ విద్యాసాగరుడు,తదితరులు పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్- బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: