దివ్యాంగుల సౌకర్యాల కల్పనకు కృషి

- చైర్ పర్సన్ షేక్ మా బున్నిసా

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం  సంఘం కార్యాలయంలో సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురపాలక  చైర్మన్ షేక్ మాబున్నిసా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మోటార్ తో పని చేసే కుట్టుమిషన్, 30 మంది  దివ్యాంగులకు నూతన వస్త్రాలు లయన్స్ క్లబ్ సభ్యులు రైల్వే అధికారులు రవి ప్రకాష్, రామన్న, వెంకటేశ్వర్లు సౌజన్యంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ షేక్ మాబున్నిసా మాట్లాడుతూ అధికారులతో చర్చించి పురపాలక సంఘం ద్వారా దివ్యాంగులకు కేటాయించాల్సిన నిధులతో ప్రభుత్వ కార్యాలయాల్లో,  పాఠశాలల్లో, పట్టణంలో అవసరమైన చోట ర్యాంపులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు.
డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తమ నిధులలో 5శాతం దివ్యాంగులకు చట్టబద్ధంగా కేటాయించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా షేక్ మాబున్నిసా, షేక్ జలీల్ భాషా దంపతులను సంక్షేమ సంఘం తరపున శాలువా, జ్ఞాపిక, పూలమాలలతో  ఘనంగా సత్కరించి చైర్మన్ గా ఎన్నికయినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాగలమర్రి  ఓరియంటల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి, గౌరవ సలహాదారు రమణయ్య, కోఆర్డినేటర్ హనీఫ్, ఉపాధ్యక్షులు వెంకట్రావుతదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: