పాలన లోని డొల్లతనం బట్టబయలు

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఐ.ఎమ్.ఎస్. కుంభకోణంతో - కె.సి.ఆర్ అవినీతి రహిత పాలన లోని డొల్లతనము బట్టబయలైందని తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. దీనిపై కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారంనాడు జి.నిరంజన్ మాట్లాడుతూ...ఐ.ఎమ్.ఎస్ కుంభకోణములో మాజీ మంత్రి కీర్తి శేషులు నాయిని నరసింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ప్రమేయము, మంత్రి మల్లారెడ్డి మామూళ్లకు దబాయింపులు, కర్నాటక మారక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్న టి.అర్.ఎస్ శాసన సభ్యుల గురించి పల్లెత్తు మాట కూడా అనకుండా మౌనము వహించడము అవినీతి రహిత పాలన అందిస్తున్నామనే ఆయన మాటలలోని డొల్ల తనము బయట పెడుతున్నది. తాజాగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ ఒక కార్పొరటర్ అనుచరుడు ఒక మహిళను లైంగికముగా వేదించడమే కాక డబ్బు గుంజుడు కె.సి.ఆర్ పారదర్శకత పాలనకు నిదర్శనం. రాష్ట్రంలో అధికారములో ఉన్న తమ మంత్రులు, శాసన సభ్యులు ,నాయకులు, అధికారులు ఎవరికి తోచినట్టు వారు దోచుకుంటుంటే కె.సీ.ఆర్ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడము లేదు? వారి అవినీతిని ప్రశ్నిస్తే తన అవినీతిని ప్రశ్నిస్తారని కె.సి.ఆర్ జంకుతున్నారా? అనుమానము కలుగుతుంది. రాష్ట్రములో జరుగుతున్న సంక్షేమ పథకాలు చేతులు చేతులుతడుపనిదే ప్రజలకు అందుతున్నాయా ? గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. రాష్ట్రములో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అని ఆయన డిమాండ్ చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: