జర్నలిస్ట్ లను...వారి కుటుంభాలను ఆదుకోవాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కరోనా మహమ్మారీ భారిన పడి చనిపోయిన జర్నలిస్ట్ కుటుంభాలను, కరోనా తో చికిత్సపొందుతున్న జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. జర్నలిస్టులను ఆదుకొనేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకొచ్చిందన్నారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ ల కోసం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన జర్నలిస్ట్ కుటుంభానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషీయో చెల్లించాలని ఆయన అన్నారు. కరోనా భారిన పడ్డ జర్నలిస్ట్ లకు ఉచితంగా చికిత్స అందించాలన్నారు. సమాజంలో జర్నలిస్ట్ ల పాత్ర కీలకమైందన్నారు. కరోనా సమయంలోనూ వారు ప్రాణాలకు తెగించి తమ విధులు నిర్వహిస్తున్నారని ఆ‍యన తెలిపారు. వెంటనే జర్నలిస్ట్ లను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకురావాలని, వారి కుటుంభాలను ఆదుకోవాలని సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: