గోరుకల్లో డయేరియా బారిన పడిన బాధితులను,,,

పరామర్శించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

గోరుకల్లో డయేరియా బారిన పడిన బాధితులను పరామర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపి పోచ బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్,  జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి,  నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారిలు పరామర్శించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి అధికారులతో ఏ తేదీ నుండి ఈ ప్రాబ్లమ్ ప్రారంభమైనది,  ఎంతమందికి డయేరియా వచ్చింది,  అందులో ఎంత మంది పాల్గొన్నారు ఎంతమంది వైద్యం పొందుతున్నారు ఎంతమంది మంది మెరుగైన వైద్యం కొరకు సిఫార్సు చేశారని అధికారులను అడిగి  తెలుసుకున్నారు. గ్రామంలో 24 గంటలు వైద్యం అందేలా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని నైపుణ్యం గల డాక్టర్లను కూడా కేటాయించాలని,
  24 గంటలు 108 వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని అత్యవసరమైతే మెరుగైన వైద్యం కోసం బాధితులను జిల్లా వైద్యశాలలకు సిఫారసు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం  వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఈ పర్యటన జరుగుతున్నదని, ఈ గ్రామంలో డయేరియా గురై మరణించిన కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయలు తక్షణ సాయం అందించపోతున్నామన్నారు. గ్రామంలో త్రాగునీటి పైప్లైన్ దెబ్బతిన్నాయని, వాటిని మార్చడం కొరకు జిల్లా కలెక్టర్ చొరవతో 25 లక్షల రూపాయల నిధులను కేటాయించి పైపులైన్ల మార్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఎవరు అపోహలు నమ్మవద్దని  అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, ఇన్చార్జి డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ అంకిరెడ్డి,  డిపిఓ ప్రభాకర్, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: