"ఊర్వశి" దరి చేరిన "నిన్ను చేరి"

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన "నిన్ను కోరి" ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా "నిన్ను చేరి" అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు యువ ప్రతిభాశాలి సాయికృష్ణ తల్లాడ.

     తేజ హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ పంపిణీదారు శంకర్ కొప్పిశెట్టి నిర్మాతగా మారి.. సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో రూపొందించిన "నిన్ను చేరి" ఈనెల 14 నుంచి "ఊర్వశి ఓటిటి" ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

    రాజు, మాధురి, గౌతమ్ రాజ్, భద్రం, శాంతి స్వరూప్, కిషోర్ దాస్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం తమ దర్శకుడు సాయి కృష్ణ ప్రతిభకు అద్దం పడుతుందని, నటీనటులు, సాంకేతిక నిపుణలకు మంచి పేరు తెస్తుందని నిర్మాత శంకర్ కొప్పిశెట్టి పేర్కొన్నారు. 'ఊర్వశి ఓటిటి' యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

     ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ ఆర్.ఎస్., సంగీతం: వి.ఆర్.ఎ.ప్రదీప్, ఎడిటర్: శ్రీకాంత్ కురెల్లి, నిర్మాత: శంకర్ కొప్పిశెట్టి, రచన-దర్శకత్వం: సాయికృష్ణ తల్లాడ, విడుదల: ఊర్వశి ఓటిటి!!


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: