డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి 

- టిడిపి యువ నాయకురాలు ఏ.వి. జస్వంతి రెడ్డి

మద్దతు తెలుపుతున్న జస్వంతి రెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని టిడిపి యువ నాయకురాలు ఏ.వి. జస్వంతి రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు టిడిపి యువ నాయకురాలు ఏ.వి. జస్వంతి రెడ్డి ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికో మతానికో చెందలేదని జాతి గౌరవ పతాక అన్నారు.
ఈ దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి ఆయన ఆలోచనలు ఆదర్శాలు నేటి తరానికి, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. నంద్యాలలో అటువంటి మహానేత కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుని స్మరించుకోవాలన్నా, గుర్తుంచుకోవాలన్నా భవిష్యత్తు తరాలకు చూపించడానికి పట్టణంలో ప్రధాన సెంటర్లో మున్సిపల్ కార్యాలయం ఎదుట లేదా టేక్కే మార్కెట్ యార్డు వద్ద విగ్రహ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు తమ వంతు సహకారం ఉంటుందని ఉద్యమం చేస్తున్నా సంఘాలకు అండగా నిలుస్తామని తెలిపారు. 48 గంటల నిరాహార దీక్షకు కూర్చున్న విద్యార్థి సంఘం నాయకుడు రామచంద్రుని పూలమాల వేసి అభినందించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: