మూడు వ్యవసాయ చట్టాలు రద్దయ్యేంత వరకు పోరాటం

ఏఐకేఎస్‌ 86వ ఆవిర్భావ దినోత్సవాన రైతు నాయకులు ప్రతిజ్ఞ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు అఖిల భారత రైతుల పోరాటం కొనసాగుతుందని, 11 ఏప్రిల్‌ 1936న ఏర్పడిన అఖిల భారత కిసాన్‌ సభ అవిర్భావ దినోత్సవాన ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం ఎదుట ఏఐకేఎస్‌ జెండాను జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరించారు. అఖిల భారత కిసాన్‌ సభ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రైతుల సమస్యల పరిష్కారానికి భూస్వాముల, పెట్టుబడిదారుల దోపిడి నుండి విముక్తికి నిరంతరం దేశ వ్యాప్త పోరాటాలు, స్థానిక పోరాటాలు నిర్వహించుతూనేవుంది. కిసాన్‌ సభ ఏర్పడగానే కేరళ, బెంగాల్‌, మహరాష్ట్ర, తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాలలో సాయుధ రైతాంగ పోరాటాలు నిర్వహించింది. పున్నప్రా వాయిలార్‌, తెబాగా, వర్లి, తెలంగాణ సాయుధ పోరాటం, బెటర్‌మెంట్‌ టాక్స్‌ వ్యతిరేక పోరాటాలు నిర్వహించింది. 1946 నుండి 51 వరకు జరిగిన పోరాటాలను దడిసిన అంగ్లేయ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వకతప్పలేదు. సాతంత్య్రానంతరం భూ సమస్య, ఇరిగేషన్‌, మార్కెట్‌ ధరలు, కరువు, వరదల నష్టాలు, విత్తనాలు తదితర సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు సాగిస్తున్నాయి.

ప్రస్తుతం బీజేపి తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 510 రైతు సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి నేటికి 136 రోజులుగా పోరాటాలను సాగిస్తూనే వుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోయి చట్టాలను రద్దు చేయకపోవడంతో పోరాటాలు కొనసాగుతూనేవున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే మూడు చట్టాలను రద్దు చేయడంతోపాటు విద్యుత్‌ సవరణ చట్టాన్ని పార్లమెంట్‌ లో ప్రవేశ పెట్టకుండా ఉపసంహరించుకోవాలి. పోరాటం సందర్భంగా 320 మంది మరణించిన రైతులకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి. వరదల వలన, కరువుల వలన జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలి. పార్లమెంట్‌లో కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం ఆమోదించాలి. పై సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగుతునే వుంటాయని నాయకులు ఉద్గాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు మాదినేని లక్ష్మి, మూడ్‌ శోభన్‌, నాయకులు కిషోర్‌, రాహుల్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహత్మా జోతిరావ్‌ పూలే జయంతి

దళిత, గిరిజన, బలహీన వర్గాలను అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు జరపాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తుంది. నాడు పూలే విద్య విస్తరణకై సావిత్రిబాయితో కలిసి చేసిన యగం నేటికి అమలు కాకపోవడం ప్రభుత్వాల వైఫల్యాలు తప్ప మరొకటికాదు. అంటరాని తనం, కుల వివక్షతను కొనసాగించడం సమాజ లక్షణాలు. ఈ లక్షణాలను తొలగిస్తామని పాలకులు పదేపదే చెప్పడం తప్ప ఆచరణలో అస్తిత్వ ఉద్యమాలను కొనసాగిస్తూ గత దృష్టలక్షణాలను కొనసాగిస్తున్నారు. కేంద్రంలోకి బీజేపీ వచ్చాక ఒకే దేశం, ఒకే భాష, ఒకే విద్య, ఒకే పన్నుతోపాటు వ్యవసాయ విధానాలను రద్దుపరచడం లాటి చర్యలు చేపట్టింది. వీటి వలన అణగారిన వర్గాలు మరింత అడుగుకు వెలుతున్నాయి. పేదలు దేశంలో బ్రతకలేని పరిస్థితి కనబడడంలేదు. అందువలన ఫూలే లాంటి సంఘ సంస్కర్తల లక్ష్యాలను అమలు చేయాలని పాలకులకు తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేస్తున్నది. ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్దమయి తమ హక్కులు సాధించుకొవడానికి ఐక్యపోరాటాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: