కర్ఫ్యూనా.. లాక్‌డౌనా..

48 గంటల్లో తేల్చండి

తెలంగాణ హైకోర్టు ఆదేశం 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ర్యాలీలు, వివాహాలపై ఆంక్షలు విధించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించింది. ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్స్‌పై పర్యవేక్షణ ఏర్పాటు చేసి రోగులను కాపాడాలని ఆదేశాల్లో పేర్కొంది. 48 గంటల్లో కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే తామే ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన  దాపరికం ఎందుకు? అనే కథనాన్ని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి పిటిషనర్లు తీసుకురాగా.. వాస్తవాలను కప్పి పుచ్చుకుండా, కరోనా మరణాలు, టెస్టులు, బెడ్స్‌పై వాస్తవ సమాచారాన్ని రోజు వారీ మీడియా బులెటిన్‌లో పేర్కొనాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: