డ్యూరోఫ్లెక్స్ సౌండ్స్ ఆఫ్ స్లీప్ - 

సీజన్ 1 ను క్లాసిక్ తెలుగు లాలిపాటతో ముగిస్తుంది

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

సోనీ మ్యూజిక్ ఇండియాతో కలిసి నిర్మించబడిన మరియు ప్రముఖ నటీమణి,ఈమధ్యనే తల్లి అయిన కల్కి కోచ్లిన్ హోస్ట్ చేసిన ఈ సంగీత ధారావాహిక గీతా మాధురిచే పునఃసృష్టి చేయబడిన ప్రసిద్ధ తెలుగు పాటతో ముగుస్తుంది.

నేషనల్, 23 ఏప్రిల్, 2021:డ్యూరోఫ్లెక్స్ సౌండ్స్ ఆఫ్ స్లీప్ అనేది ఒక ప్రత్యేకమైన డిజిటల్ మ్యూజిక్ సిరీస్, ఇది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పాత, క్లాసిక్ లాలిపాటల ప్రదర్శనలతో మన గత జ్ఞాపకాలకు తిరిగి తీసుకువెళుతుంది. నిద్రపుచ్చడానికి సంగీతం యొక్క పాత్రను అన్వేషిస్తూ, బ్రాండ్ ఐదు అందమైన ప్రాంతీయ లాలిపాటలను విడుదల చేసింది, ఇది డ్యూరోఫ్లెక్స్ మరియు సోనీ మ్యూజిక్ ఇండియా యొక్క యూట్యూబ్ మరియు సోషల్ ఛానెళ్లలో మొత్తం 11.5 మిలియన్లకు పైగావీక్షణలను విజయవంతంగా సంపాదించింది. ఈ వారం, డ్యూరోఫ్లెక్స్ వారి ప్రత్యేకమైన సంగీత శ్రేణి యొక్క సీజన్ 1 మరియు వారి ఆరవదైన చివరి ట్రాక్, క్లాసిక్ తెలుగు లాలిపాటతో ముగిస్తుంది.

పిల్లల కోసం ప్రసిద్ధ తెలుగు పాట, ‘చందమామా రావే’, తెలంగాణలో పిల్లలు మాత్రమే కాకుండా, పెద్దలు కూడా గుర్తించిన, ఇష్టపడే లాలిపాటలలో ఒకటి. ఇది ఒక క్లాసిక్ దీన్ని రాష్ట్ర ప్రజలు తమ బాల్యం అంతా వింటూ పెరిగారు, పెద్దలకు కూడాజ్ఞాపకాల యొక్క వెచ్చని భావాన్ని తీసుకువస్తుంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత మంత్రముగ్దులను చేసే స్వరాలలో ఒకటైన, గీతా మాధురితో అందమైన ఈ పాట పునఃసృష్టి చేయబడింది. ఈ కలలు కనే ప్రశాంతమైన పాటకు గీతా మాధురి యొక్క ఆత్మీయమైన గాత్రం, మీకు ప్రశాంతమైన మరియు కలతలేని నిద్రను అందిస్తుంది.

సౌండ్స్ ఆఫ్ స్లీప్ ద్వారా అందరిని చేరుకోవడంలో అది సాధించిన విజయం ద్వారా, డ్యూరోఫ్లెక్స్ మంచి ప్రీ-స్లీప్ రొటీన్ యొక్క ప్రాముఖ్యతపై సందేశాన్ని విజయవంతంగా నడపగలిగింది. ఈ బ్రాండ్ ఇంటర్నెట్‌లోని అనేకమంది ప్రముఖ తల్లిదండ్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది, వారు వారి వ్యక్తిగత బాల్య కథలు మరియు భావోద్వేగాలను పంచుకున్నారు. రణ్విజయ్ సింఘా, స్మృతి ఖానా, హర్ష్‌దీప్ సింగ్, బి పరాక్, నీరజ్ మాధవన్, బర్ఖా సేన్ గుప్తా వంటి ప్రముఖ తల్లిదండ్రులు, ఈ లాలిపాటలను పాడటం మరియు వారికి ఇష్టమైన వాటిని పంచుకోవడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ స్లీప్ డే సందర్భంగా ట్విట్టర్‌లో #DurofelxSoundsOfSleep ట్రెండ్ ను తయారుచేసే దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు తమ అభిమానపాటలు మరియు లాలిపాటలకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు.

దీనిపై వ్యాఖ్యానిస్తూ, డ్యూరోఫ్లెక్స్ మార్కెటింగ్ మరియుఇ-కామర్స్ వైస్ ప్రెసిడెంట్ స్మితా మురార్కాఇలా అన్నారు, “చందమామ రావే అనేది తెలుగు మాట్లాడే ప్రాంతాలలోని ప్రతి వయస్సు వారు గుర్తించిన పాట, ఎందుకంటే ప్రతి వ్యక్తికి 

ఈ అందమైన, క్లాసిక్ పాటతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పాట ప్రేమ మరియు సొంత భావనను తెస్తుంది అలాగే గీతా మాధురి యొక్క గానం లాలిపాటను మరింత ప్రత్యేకమైనదిగా చేస్తుంది. ”

ఈ కార్యక్రమం ముగింపు గురించి మాట్లాడుతూ, శ్రీమతి మురార్కా తన భావాలను ఇలా జతచేశారు,"గత కొన్ని వారాలు బ్రాండ్ కొరకు చాలా ఉత్తేజకరమైనవి,సహకారాలు, అపారమైన ప్రతిస్పందన మరియు ఫీడ్‌బ్యాక్‌లు సీజన్ 1ను  చాలా ప్రత్యేకమైన జ్ఞాపకంగా మార్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది వ్యక్తులను కలవటానికి మరియు మంచి నాణ్యమైన నిద్ర యొక్క ప్రాముఖ్యత యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఇటువంటి ప్రత్యేకమైన మరియు సృజనాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టడం కొనసాగించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ”

డ్యూరోఫ్లెక్స్ సౌండ్స్ ఆఫ్ స్లీప్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ, గీతా మాధురి ఇలా వ్యాఖ్యానించారు, "భారతదేశంలో లాలిపాటలపై ఒక ప్రదర్శన సృష్టించబడటం అనేది ఇదే మొదటిసారి. పిల్లలుగా మనమందరం నిద్రించడానికి లాలిపాటలపై ఆధారపడ్డాం మరియు గొప్ప సంగీత దర్శకుని పాటను పాడే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. పాట యొక్క శ్రావ్యత చాలా అందంగా ఉంది మరియు ఇది చాలా ప్రతిభావంతులైన బృందంచే అద్భుతంగా పునఃసృష్టి చేయబడింది. ఈ అద్భుతమైన ప్రయత్నంలో భాగం కావడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు డ్యూరోఫ్లెక్స్‌కు కృతజ్ఞతలు. మీరు దీన్ని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. "

డ్యూరోఫ్లెక్స్ యొక్క సృజనాత్మక ఏజెన్సీ భాగస్వామి, సన్నీ సైడ్ అప్., డ్యూరోఫ్లెక్స్ సౌండ్స్ ఆఫ్ స్లీప్‌ను క్రియేట్ చేయటానికి దోహదం చేసింది. దీనిని సోనీ మ్యూజిక్ ఇండియా మరియు లోడెస్టార్ యుఎమ్ స్టూడియోస్‌తో పాటు ప్రొడక్షన్ అసోసియేట్‌లతో కలిసి రూపొందించారు.

డ్యూరోఫ్లెక్స్ సౌండ్స్ ఆఫ్ స్లీప్ ప్రపంచ స్లీప్ డే, మార్చి 19 న బ్రాండ్ యొక్క యూట్యూబ్ ఛానెల్ మరియు సామాజిక ప్లాట్‌ఫామ్‌లలో ప్రదర్శించబడింది. ఈ పాట సోనీ మ్యూజిక్ ఇండియా యొక్క సామాజిక ఛానెల్‌లలో సహ-హోస్ట్ చేయబడింది. తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, బెంగాలీ, పంజాబీ వంటి భాషలలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి లాలిపాటలను తిరిగి గుర్తుచేసుకోవటానికి ప్రతి శుక్రవారం ట్యూన్ చేయండి మరియు లాలిపాటలు నిద్రకు ఎందుకు మంచివో గ్రహించండి. సౌండ్ ఆఫ్ స్లీప్ ఎపిసోడ్ జాబితా క్రింద ఇవ్వబడింది.

•మార్చి 19 - హిందీ- మోనాలి ఠాకూర్

•మార్చి26 - బెంగాలి - షల్మలి ఖోల్గడే

•ఏప్రిల్ 02 – మలయాళం- సనా మొయిడుట్టి

•ఏప్రిల్09– తమిళం- చిన్మయి శ్రీపాద

•ఏప్రిల్16 – పంజాబీ - శిల్ప రావు

•ఏప్రిల్23 – తెలుగు- గీతా మాధురి

దయచేసి డ్యూరోఫ్లెక్స్ సౌండ్స్ ఆఫ్ స్లీప్ యొక్క చివరి ఎపిసోడ్ లింక్ క్రింద చూడండి:

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: