తర్లుపాడులో కోవిడ్-19 కేసుల నమోదు

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

    తర్లుపాడు మండలమునందు కొత్తగా రెండు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనాయి. మొత్తం మండలములో రెండవ దశలో 6 కేసులు నమోదైనవి. తర్లుపాడు గ్రామము నందు కోవిడ్-19 పాజిటివ్ కేసులకు సంబందించి డాక్టర్ టి. చైతన్య సుధ మెడికల్ ఆఫీసర్ గారు హోమ్ ఐసొలేషన్ కిట్స్ పంపిణీ చేసినారు. కేసెస్ మరియు కాంటాక్ట  తగు జాగ్రత్తలు , మాస్కులు ధరించడం, 6 అడుగుల భౌతిక దూరం, శానిటైజర్ తో చేతులు శుభ్రంగా వుంచుకొంటూ తగు జాగ్తత్తలు తీసుకోవాలని కోవిడ్-19 గురించి అవగాహన కల్పించినారు. 
ఈ క్రమములో ఈరోజు సోమవారం రాగసముద్రం, మంగళకుంట, నాతానాంపల్లిలో వ్యాక్సిన్ 59మందికి వేయడంజరిగింది. కావున మండలములోని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని, 45 సంవత్సరాలవయస్సుపై బడిన అందరూ తర్లుపాడు పి.హెచ్.సి. నందు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవలసిందిగా తెలిపారు.     ఈ కార్యక్రమములో సి.హెచ్.ఓ. జె.తులసీప్రసాద్ రావు, హెల్త్ సూపర్ వైజర్ టి.సుధాకర్, ఎ.ఎన్.ఎమ్. బి.లక్ష్మీదేవి, వెంకటేశ్వర్లు ఓ.ఎస్., ఆషా, సుశీల తదితరులు పాల్గోన్నారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: