బంద్ జయప్రదం చేయాలని కోరుతూ..

నంద్యాలలో బైక్ ర్యాలీ

పీడీఎస్ యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీవైఎల్ -బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి,యువజన సమాఖ్య విన్నపం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి-5 (రేపు) వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగే బంద్ జయప్రదం కోసం నంద్యాలలో పీడీఎస్ యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీవైఎ-బీసీ,ఎస్సి,ఎస్టీ మైనార్టీ విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల సీపీఐ కార్యాలయం నుండి జరిగిన బైక్ ర్యాలీని మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీనివాసులు ప్రారంభించారు.
పీడీఎస్ యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీవైఎల్-బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల సీపీఐ కార్యాలయం నుండి ప్రారంభమయి తాలూకా ఆఫీసీ,పద్మావతి నగర్,శ్రీనివాస్ నగర్,సంజీవ్ నగర్,మున్సిపల్ ఆఫీస్ మీదుగా పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ముగించడం జరిగిందని పీడీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, బీసీ,ఎస్సి,ఎస్టీ మైనార్టీ విద్యార్థి,యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ యాదవ్, పీవైఎల్ నంద్యాల డివిజన్ కార్యదర్శి నవీన్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎప్ నంద్యాల డివిజన్ కార్యదర్శులు సురేష్,విష్ణు, లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ డివిజన్ నాయకులు అఖిల్, ఏఐఎస్ఎఫ్,. ఏఐవైఎఫ్ నాయకులు సురేష్,చైతన్య, రవి,వాసు,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: