అంబరాన్ని తాకిన సంబరాలు

తెరాస లీగల్ సెల్ అధ్వర్యంలో సంబరాలు

ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం పట్ల హర్షం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ పార్టీ అభ్యర్థిగా సురభి వాణిదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు లో సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలంగాణ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా " " "న్యాయవాదులకు అండ సిఎం కేసీఆర్ అంటూ " నినాదాలు చేశారు. """ జై కేసీఆర్, జై కేసీఆర్ "" అంటూ నినాదాలు చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం కోసం కృషి చేసిన న్యాయవాదులకు కృతజ్ఞతలు ప్రకటించారు. న్యాయ వాదులు ఈ విజయంలో కీలకపాత్ర పోషించారనీ, ఓట్లు వేసి ప్రతీ ఒక్కరూ విధిగా కృషి చేసి గెలిపించిన న్యాయవాదులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారు. విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, కిరణ్, మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్, తిరుపతి వర్మ, విజయసింహ రెడ్డి, కొరం ప్రవీణ్, రాసూరీ శివరాజ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. 

 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: