మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసాను,,,

సన్మానించిన అవాజ్ కమిటీ నాయకులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసాను అవాజ్ కమిటీ మండల నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా నంద్యాల మండల అవాజ్ కమిటీ అధ్యక్షులు వసీం అక్రమ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ముస్లిం జనాభా శాతం ఎక్కువ కాబట్టి మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం ముస్లింలకు కేటాయించాలని మొట్టమొదటిసారిగా అవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి డిమాండ్ చేశారని, 120  సంవత్సరాల చరిత్ర గల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ గా ముస్లిం మహిళ కేటాయించడం చాలా సంతోషంగా వుందన్నారు.
నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదవులు ముస్లింలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని,  అదే క్రమంలో మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డికి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి, అవాజ్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అవాజ్ కమిటీ నంద్యాల మండల నాయకులు అలీ బాషా, అమీర్ బాషా, హాఫిజ్ అబ్దుల్ రహమాన్, సయ్యద్ కరీం బాషా, ముహమ్మద్ హుస్సేన్,  ముల్లా ఇక్బాల్, పిట్టల అప్జల్  తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: