ప్రశాంతంగా ముగిసిన ప్రచారం

పోలింగ్ కోసం అన్నీ ఏర్పాట్లు 

కరోనా జాగ్రత్తలు పాటించాలని విన్నపం 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారానికి గురువారం తెరపడింది. శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటించాలని, విధిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. అభ్యర్థులు విజయం కోసం కృషి చేస్తున్నారు. అద్యక్ష పదవీ కోసం మధుషేకర్, మహేష్ రాజే, సంజీవ్ కుమార్, నాగేందర్, రవీందర్ రావు బరిలో ఉన్నారు.  ప్రధాన కార్యదర్శి కి లక్ష్మణ్ సింగ్, జేస్పాల్ సింగ్, సురేష్ గౌడ్, వేణుగోపాల్ పోటీలో ఉన్నారు. లైబ్రేరియన్ కోసం కళావతి, సంధ్యారాణి మధ్య పోటీ ఆసక్తికరంగా నెలకొంది. ఉపాధ్యక్షులుగా లక్ష్మినారాయణ, రాజశేఖర్ గౌడ్, యాదగిరి. సంయుక్త కార్యదర్శి అభ్యర్థి లక్ష్మణ్ గంగా ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ అభ్యర్థిగా సయ్యద్ మన్సూర్, వెంకటేష్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని సమాచారం. ట్రెజరర్ అభ్యర్థిగా ఆనంద్ గౌడ్, లడ్డా, కులకర్ణి లు సైతం పోటా పోటీగా ప్రచారం చేశారు. ఎగ్జక్యూటివ్ సభ్యులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్లకార్డులు పట్టుకుని ప్రచారంలో పాల్గొన్నారు.

 


సుమారు రెండువేల వరకు న్యాయవాదులకు ఓటుహక్కు ఉంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని పోలింగ్ అధికారులు ప్రకటించారు. దీంతో శుక్రవారం నాటికి అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవాదులు జాగ్రత్తలు పాటించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలింగ్ అధికారులు తీసుకుంటున్నట్లు తెలిపారు. 


 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: