తర్లుపాడు మండలంలో..

 "రైతు సంఘం జెండా" ఆవిష్కరణ 

 


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో ఢిల్లీలో జరిగిన రైతు సంఘం ఉద్యమం 100 రోజులు అయిన సందర్భంగా భారతదేశంలో అన్ని గ్రామాలలో రైతు సంఘం జండా ఆవిష్కరణ జరిగినది. అందులో భాగంగా తర్లుపాడు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ రైతు సంఘం మార్కాపురం డివిజన్ సహాయ కార్యదర్శి ఏరువ. పాపిరెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగే జెండా ఆవిష్కరణ అందరూ ప్రజలు పాల్గొని భవిష్యత్తులో జరిగే వ్యవసాయ రంగం మోటార్ల మీటర్ల రద్దు, గ్యారెంటీ మద్దతు రేటు, ప్రైవేట్ రంగానికి కట్టబెట్టే ఈ దొంగ, నల్ల చట్టాలను రద్దు చేసేవరకు ఈ ఉద్యమం జరుగుతుంది. అని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె.సత్యనారాయణ రెడ్డి, మెట్టు. శివారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కె. రామకృష్ణారెడ్డి, ఎం.అంకిరెడ్డి, కె.పోలయ్య, మల్లారెడ్డి, టీ.శ్రీనివాస రెడ్డి, ఆటో వర్కర్స్, బి. పిచ్చయ్య, జ్ఞాన సుందరం, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: