భారత జాతీయ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్...

పోరాట యోధుడు కల్నల్ మెహబూబ్ జయంతి

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం లోని భగత్ సింగ్ సర్కిల్ లో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిలర్ డీఈ. రమేష్ కుమార్ విశిష్ట అతిథిగా కల్నల్ మెహబూబ్ అహ్మద్ జయంతిని ఘనంగా ఆచరించారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ ప్రసంగిస్తూ మహనీయుడు కల్నల్ మెహబూబ్ అహ్మద్ గుణ గణాలను ప్రస్తావిస్తూ దేవుడు నాకు ఒక్కటే జన్మ ఇచ్చాడు  వంద జన్మలు లభించినా వాటిని నేతాజీ కోసం త్యాగం చేసే వాడను అని భారత జాతీయ సైన్యంలో కీలక పాత్ర పోషించిన యోధుడు కల్నల్ మెహబూబ్ అహ్మద్ బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా లోని చౌహాట్ లో సంపన్న భూస్వామి కుటుంబంలో1920మార్చి 19న జన్మించాడు11సంవత్సరాల వయసులో 1932 లోడెహ్రాడూన్ లోని రాయల్ ఇండియన్ మిలటరీ కళాశాల లో చేరాడు.

 


1942లో25వేల భారత జాతీయ సైన్యంలో కెప్టెన్ మెహబూబ్ అహ్మద్ పలు బాధ్యతలు చేపట్టారు నా మాతృభూమి విముక్తి కోసం చిందించాల్సిన మొదటి రక్తపు బొట్టు నాది కావాలి అని బిగ్గరగా ప్రకటించాడు నేతాజీ ఆజ్ఞాపిస్తే నా మాతృభూమి కోసం నా శరీరం లోని చివరి రక్తపు బొట్టు వరకు అర్పిస్తా అని నినదించాడు శుభాష్ చంద్ర బోస్ రంగూన్ విడిచి వెళ్ళాక బ్రిటిష్ వారు కల్నల్ మెహబూబ్ ను అరెస్టు చేసి నిర్బంధించారు తమ వైపు తిప్పుకోవటానికి పన్నంగాలు పన్ని బ్రిటిష్ వారు విఫల మయ్యారు.
స్వాతంత్రానంతరం ఇండియన్ డిఫెన్స్ అకాడమీ లో బాధ్యతలు నిర్వహించారు 1954ఇరాక్ లో భారత దౌత్యవేత్త గా.1957లో గోవాలో ప్రత్యేక అధికారిగా.1958లో జర్మనీలో భారత కాన్సల్ జనరల్ గా.1962లో నేషనల్ డిఫెన్స్ కాలేజీ లో అధికారిగా.1963లో మలేషియా హైకమీషనర్ గా1966లో ఇరాక్ దౌత్యప్రతినిధిగా.1971చీఫ్ ప్రోటోకాల్ ఢిల్లీగా.1973లో ఇండోనేషియా లోదౌత్యధికారిగా.1980లో కెనడా హై కమీషనర్ గాకల్నల్ మెహబూబ్ సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చి దేశ గౌరవాన్ని దేశకీర్తిని ప్రపంచ నలుమూలలా చాటారు చివరగా కల్నల్ మెహబూబ్ అహ్మద్ అమర్ హై అనే నినాదాలతో నివాళులర్పించారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: