ఆర్య వైశ్యాసంఘం ఆధ్వర్యంలో...

మున్సిపల్ ఛైర్మన్  చిర్లంచర్ల బాల మురళీకృష్ణకు

ఘన సన్మానం


మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాల మురళీకృష్ణ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

     మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డులో,  కులమతాలకు, పార్టీలకు అతీతంగా అత్యధిక మెజారిటీతో గెలిచి, పట్టణములోని 35 వార్డుల కౌన్సిలర్లచే మున్సిపల్ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయిన చిర్లంచర్ల బాల మురళీకృష్ణని పురపాలక కౌన్సిల్ హాలులో ఆర్య వైశ్యాసంఘం వైస్ ప్రెసిడెంట్ యక్కలి హనుమంతరావు ఆధ్వర్యములో ఘనంగా సన్మానం చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కు పలువురు ఆర్య వైశ్యా సంఘం సభ్యులు అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా నా రాజకీయ ఎదుగుదలకు ఊపిరి పోసారని,  గతంలో మా తండ్రిగారైన స్వర్గీయ చిర్లంచర్ల చెంచయ్య గారు , జిల్లా గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ గాను మరియు ఇదే మార్కాపురం పట్టణ మున్సిపల్ ఛైర్మన్ గాను పదవులు నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చారని, వారి వెన్నంటి వుంటూ వారి అడుగుజాడలలలో నడుస్తూ వారి పనితీరును దగ్గరగా చూస్తూ వారిని నా మార్గదర్శకుడిగా తీసుకున్నాను, మా నాన్నా పరోక్షంగా నా ఈ రాజకీయ ఎదుగుదలకు కారణమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలుతెలియచేశారు. ఈ కార్యక్రమములో యక్కలి సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీను, చక్కా మోహన్ రావు, షేక్ ఖాజావలి, మొగిలి మల్లికార్జున, కె.భాస్కర్, కిషోర్, సముద్రాల నాగేంద్ర, పాదర్తి కృష్ణ మరియు ఆర్య వైశ్య సంఘ సభ్యులు పాల్గోన్నారు.  

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: