ఓర్వకల్లు ఏయిర్ పోర్ట్ ప్రారంభం పట్ల హర్షం

ఏయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరు పెట్టటం అభిననీయం

ఈ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుంది

 రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కర్నూలు, అనంతపురం జిల్లాల తో పాటు రాయలసీమలో అంతర్భాగంగా  వున్న ప్రకాశం,తెలంగాణ లోని గద్వాల, కర్ణాటక లోని రాయచూరు జిల్లాల  ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన  ఓర్వకల్లు ఏయిర్ పోర్టు ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించడం హర్షణీయమని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. అలాగే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యము కోసం అలుపెరుగని పోరాటాలు చేసి ఊరి కంభం ఎక్కి ప్రాణాలు విడిచిన అమరజీవి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి లాంటి గొప్ప త్యాగ ధనుని పేరును ఓర్వకల్లు ఏయిర్ పోర్ట్ కు నామకరణం చేయడం హర్షణీయమని, ఈ సందర్భంగా  పేరు పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఇప్పటికే న్యాయ రాజధానిగా కర్నూలు ను ప్రకటించారని,దీనికి తోడు విమాన సర్విసులు కూడా తోడు కావడంతో ప్రయాణ సౌలభ్యం తోపాటు అ ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు.   రోజు రోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో రవాణా రంగం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో అ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న వాయు సేవల కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి ఫలితంగా నేటికి నెరవేరిందని అన్నారు. ఏయిర్ పోర్ట్ ప్రారంభం రోజు నుండే విశాఖ, చెన్నై, బెంగుళూరు,గన్నవరం తదితర ప్రాంతాలకు ఇండిగో ఏయిర్ లైన్స్ సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కర్నూలు నగర, జిల్లా ప్రజలు విమాన సేవలు అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: