కుటుంబాలే సమాజానికి మూలస్థంభాలు...

కుటుంబాల అభివృద్ధికి సారధులు మహిళలు

ఖిల్లా డివిజన్ మహిళా అధ్యక్షురాలు రహీమున్నీసా బేగం

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

కుటుంబాలే సమాజానికి మూలస్థంభాలు అలాంటి కుటుంబాల అభివృద్ధికి సారధులు మహిళలే. కుటుంబాన్ని కాపాడుకుంటేనే సమాజం బాగుంటుందని ఖిల్లా డివిజన్ మహిళా అధ్యక్షురాలు రహీమున్నీసా బేగం అన్నారు .నేడు కార్యాలయంలో జమాతే ఇస్లామి హింద్ ఖిల్లా డివిజన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన పటిష్ట కుటుంబం పటిష్ట సమాజం ఉద్యమం ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని మన కుటుంబ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయని. భార్యభర్తల అనుబంధం బలహీనమవుతోందని. తల్లిదండ్రులు అనాథాశ్రమాల పాలవుతున్నారు.
ఇంట్లో పెద్దదిక్కులేకుండా పోతోందని. కుటుంబ వ్యవస్థను కాపాడుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారే ముప్పు పొంచి ఉందని అన్నారు విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థను పునర్నిర్మించుకోవడంతోనే మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని తద్వారా శక్తివంతమైన దేశాన్నిసాధించవచ్చని ఆమె అన్నారు. ఒకప్పుడు ఇల్లంటే అమ్మానాన్నల ఆత్మీయతలు, ప్రేమ వాత్సల్యాలు, పెద్దల ఆశీర్వాదాలతో కళకళలాడేది. ప్రేమపరిళాలు వెదజల్లే మన ఇళ్లు ఇప్పుడు కళతప్పాయి. వైఫై మాయలో ప్రపంచమే ఇంట్లో ప్రత్యక్షమవుతున్న        తరుణంలో పక్కింటోళ్లెవరో తెలియడం లేదుని ఆందోళన చెందారు.
ఈ సంస్కృతిని రూపుమాపి మన కుటుంబ వ్యవస్థను పునర్నిర్మించుకోవాలని అన్నారు. ఇంటిని చక్కదిద్దుకుంటేనే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో పటిష్ట కుటుంబం ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేపట్టామని ఆమె అన్నారు. అనంతరం  అర్బన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సైదా భాను మాట్లాడుతూ కుటుంబ సభ్యుల హక్కులు నెరవేరాలంటే అంతా కలిసి బాధ్యతలను పంచుకోవాలని అప్పుడే ఆ కుటుంబం ఆదర్శంగా నిలుస్తుందని ,సంతోషాలకు నిలయం గా మారుతుందని లేదంటే బంధాలు అనుబంధాలు బీటలు వారి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అవుతుందని అన్నారు, ప్రేమ ఆప్యాయతల స్థానంలో పగ ద్వేషం శత్రుత్వం పురుడు పోసుకుంటాయని అన్నారు, విచ్చిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థను పటిష్టం కావాలంటే ఖురాన్ బోధనలకు అనుగుణంగా జీవితం గడపాలని అన్నారు, బంధువులు సన్నిహితులు, తోబుట్టువుల బంధుత్వాన్ని తెంచడాన్ని ఖురాన్ నిషేధించిందని, ఈ వైఖరి వల్ల ప్రేమ ఆప్యాయతలు బంధుత్వం సంబంధాల గొప్పతనాన్ని తెలియపరచ లేక పోతున్నామని అన్నారు.
దీని ప్రభావం పిల్లల్లోనూ తీవ్రంగా పడుతుందని అన్నారు, తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగడం బంధువుల అనాధల, నిరుపేదల పట్ల మంచిగా వ్యహరించండని ఖురాన్ చెప్పడం జరిగిందని అన్నారు, ప్రవక్త మహనీయులు బంధుత్వ సంబంధాలను తెంచడం మానుకోండి మీకు ఎదుటివారు మేలు చేసినా చేయకపోయినా మీరు మాత్రం వారికి మేలు చేయాలని తెలియజేశారని అన్నారు  క్యాంపెయిన్ కన్వీనర్ ఫర్జానా మాట్లాడుతూ కుటుంబ విలువలపై ప్రచురించిన సాహిత్యాన్ని పట్టణంలో ప్రముఖలకు పంపిణీ చేసాము. పలు ప్రాంతాల్లో ముస్లిం మరియు ముస్లిమేతర మహిళలకు సభలు సమావేశాలు పెట్టి కుటుంబం పాత్ర, సమాజం పాత్రను వివరించడమే జరిగింది వారికోసం ఉపన్యాసం వ్యాసరచన మరియు పోస్టర్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ పోటీలలో నిర్వహించడం జరిగింది దానిలో మంచి ప్రతిభ ప్రదర్శించిన ఫరీదున్నిసా, తస్లీమ్ కౌసర్, సుమయ్య, సుమయ్య సదప్, జస్వితా, నాగ మెఘనా, రేష్మా ఫిర్డుస్, లుబ్నానిషాత్, శ్రీలక్మి, సయ్యదా ఫర్హీన్, సయ్యదా సాదియా లకు ప్రధమ, ద్వితీయ బహుమతులు అందించటం జరిగింది. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యక్షురాలు ఆమీనా నస్రీన్ , కార్యకర్తలు షాహెదా సుల్తానా, అయేషా జబీన్ ,కౌసర్ సుల్తానా, సమినా అఫ్రోజ్ , అయేషా , సుమయ్య తరున్నమ్, అస్ఫియ అంజుమ్, నస్రీన్, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: