ఎస్బిఐ బ్యాంక్ ప్రారంభం

సెషన్ జడ్జ్ తుకారాంజీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పునః నిర్మాణ పనులు పూర్తి చేసుకుని కొత్త హంగులతో ముస్తాబైన  భవనాన్ని గురువారం సెషన్ జడ్జ్ తుకారాం జీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.

బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్, ఉపాధ్యక్షులు దేవేందర్, గంప వెంకటేశం, లైబ్రేరియన్ మున్షీ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కిరణ్ రాజ్, అనిల్ కుమార్, జయసింహ, తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పూజ కార్యక్రమం అనంతరం బ్యాంక్ మేనేజర్ తో పాటు సిబ్బంది అధికారుల సమక్షంలో జడ్జ్ ఆవిష్కరించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

    

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: