పత్రికా రంగానికిచ్చే గౌరవం పత్రికేయుణ్ణి గెలిపించడమే

స్వతంత్ర అభ్యర్థి శ్యామ్ కు టీడీపీ మద్దతు

కౌన్సిల్లో అడుగిడితే ప్రజా సమస్యలు పరిస్కారం

వారధులు కౌన్సిల్లో వారధి కల్పిద్దాం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

                ప్రభుత్వాలకు ,ప్రజలకు వారధులు పాత్రికేయులు.పత్రికారంగం లేనిదే మనుగడలేదు.ప్రభుత్వాలు మారినా ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడేది పాత్రికేయులు.ధైర్యంగా ప్రజాసమస్యలను,అన్యాయాలను వెలుగులోకి తీసుకొచ్చేదే పాత్రికేయులు. అభివృద్ధి,ప్రజాసేవకోసం పాటుపడతారు.ప్రజలకు సేవచేయడానికి, ధైర్యంగా ముందుకు వచ్చి అధికారపార్టీ నేతల బెదిరింపులకు తలొగ్గక ఎన్నికల్లో సై అంటూ ముందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి శ్యామ్ సుందర్ లాల్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాజీమంత్రి ఎన్. ఎం.డి.ఫరూక్,మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. రాజ్ థియేటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి,ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా భయపెట్టి ఏకగ్రీవసలు చేసారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎలాసాగుతున్నాయో ప్రజలు గుర్తిస్తున్నారు.ఎన్నికల్లో ప్రజాలముందుముపోలేక,సమాధానం చెప్పుకోలేక,ఓటమి భయంతో డబ్బు,అధికారం,పోలీస్ జులంతో ఏకగ్రీవాలు చేసుకున్నారని అన్నారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిపి సత్తా ముఖ్యమంత్రి నిరూపించుకోలేక ఇలా చేస్తున్నారని అన్నారు.నంద్యాలలో మున్సిపల్ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు ఎలా ఏకగ్రీవం అయ్యారో అందరికి తెలిసిన విషయం అన్నారు.తెలుగుదేశం పార్టీ 12 వ వార్డు అభ్యర్థి కన్నయ్య శెట్టి విత్ డ్రా కావడం దురదృష్టకరమన్నారు.ఈ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న కండే శ్యామ్ సుందర్ లాల్ పత్రికరంగలో ఉండటం,ప్రజాసేవలో చురుకుగా పాల్గొనే వారుకావడంతో ఆయన గెలుపుకు తెదేపా మద్దతు ఇస్తుందని అన్నారు.సమాజంలో పత్రికారంగం కీలకమైంది.ప్రభుత్వ తప్పు,ఒప్పులను నిర్భయంగా చెప్పేవారు పాత్రికేయులు.పత్రికారంగం కు మనందరం ఇచ్చే గౌరవం పత్రికేయుణ్ణి గెలిపించడమేనని అన్నారు.అధికార పార్టీనాయకులు ఆయనపై రాజీకి భారీ వత్తిళ్ళు తీసుకొచ్చినా, విత్ డ్రా చేసుకుంటే పత్రికారంగానికే అవమానంగా భావించి డబ్బుకు,రాజకీయాలకు లోగకుండా ధైర్యంగా పోటీలో నిలబడ్డారని అన్నారు.పాత్రికేయ వృత్తికావడంతో ప్రశ్నిస్తారు,కౌన్సిల్లో అడుగుపెడితే అభివృద్ధిపై ,ప్రజా సేవ కోసం ప్రశ్నిస్తారని అన్నసరు.కౌన్సిల్ లో అడుగుపెట్టిన   కౌన్సిలర్లు ఎంతమంది ప్రశ్నిస్తున్నారో అందరికి తెలుసన్నారు.అబ్దుల్ సలామ్ కుటుంభం ఆత్మహత్య కేసును రాష్ట్రవ్యాప్తంగా వేలుగులోకి తెచ్చింది పత్రికేయులేనని గుర్తించాలి.పాత్రికేయుల కాలం పొరటంతోనే ముఖ్యమంత్రి స్పందించారు.మైనారిటీ లతో పాటు,ప్రజలు పార్టీలు అందరూ కత్తెర గుర్తుకు ఓటువేసి పత్రికేయుణ్ణి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.స్వతంత్ర అభ్యర్థి శ్యామ్ మాట్లాడుతూ పాత్రికేయ రంగస్నికి గౌరవం ఇచ్చి మద్దతు తెలిపినందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు అందరికి ధన్యవాదాలు తెలిపారు. సేవచేయడానికి మీ ముందుకు వస్తున్నాను గెలుపుకు ప్రజలతోపాటు,అన్ని పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞేప్తి చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: