ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్డ్ బ్యాంక్

ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌గా, ఫినో ఇప్పుడు సరికొత్త వృద్ధి అవకాశాలను అన్వేషించనుంది

(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

ఒక లాభదాయక పేమెంట్స్ బ్యాంక్‌గా తనదైన ముద్ర వేసిన ఫినో ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌గా మారింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్‌ను భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం – 1934లోని రెండవ షెడ్యూల్‌లో చేర్చిన విషయాన్ని 20 ఫిబ్రవరి 2021 నాటి నోటిఫికేషన్ ద్వారా RBI ప్రకటించింది.  (https://www.rbi.org.in/Scripts/NotificationUser.aspx?Id=12034&Mode=0)

షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ (షెడ్యూల్డ్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు) హోదా వల్ల ట్రెజరీలో బ్యాంకింగ్ స్థానం మెరుగుపరచుకోవడానికి మరియు RBI ప్రకారం, LAF (లిక్విడిటీ ఫెసిలిటీ) విండోలో పాల్గొనడానికి ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు అనుమతి లభించింది. లయబిలిటీల ఉత్పత్తిలో తన వ్యాపార ప్రమేయం బలోపేతం చేసుకోవడంలో కూడా ఇది ఈ బ్యాంక్‌కు సహాయపడనుంది.

అభివృద్ధి అనేది ఈ బ్యాంక్ యొక్క బలమైన ప్రక్రియగా పునరుద్ఘాటించిన ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఎం.డి మరియు సి.ఇ.ఓ శ్రీ రిషి గుప్తా మాట్లాడుతూ, “ఫినోను రెండవ షెడ్యూల్‌లో చేర్చినందుకు సెంట్రల్ బ్యాంక్‌కు మేము చాలా రుణపడి ఉంటాము. బ్యాలెన్స్ షీట్ నిర్వహణ మీద పరిధి పెంచుకోవడానికి మరియు వ్యాపారం కోసం అదనపు మార్గాలు అన్వేషించడానికి ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు ఇది వ్యూహాత్మక ప్రేరణ అందిస్తుంది. ఈ క్రమంలో, రెగ్యులేటరీ మార్గదర్శకాల్లోని వృద్ధి అవకాశాలు ఉపయోగించుకోవడానికి మరియు గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన స్థిరమైన లాభదాయకత వేగం పెంచడానికి మేము ఆసక్తిగా ఉన్నాము” అన్నారు.

ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌గా, ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు ప్రభుత్వ వ్యాపారాలు అన్వేషించడం మరియు నిర్వహించడంలో మెరుగైన స్థానం సాధించనుంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి) కింద పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్లు మరియు వివిధ సంక్షేమ పథకాలు తప్పనిసరి కావడం వల్ల ఆర్థిక సమ్మిళితంలో ఫినో అడుగులు మరింత బలోపేతం కావడంలో సహాయకరం కానుంది. అలాగే, ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఇది ఎక్కువగా కనిపించడం వల్ల, బ్యాంక్‌తో వినియోగదారు బంధం మరింత బలోపేతం కానుంది.

2020 మధ్యలోని లాక్‌డౌన్ కాలంలో ఫినో పేమెంట్స్ బ్యాంక్ మైక్రో ఏటిఎం మరియు AePS ఎనేబుల్డ్ మర్చంట్ నెట్‌వర్క్ అనేది టైర్ 4, 5 మరియు 6 ప్రాంతాల్లో డి.బి.టి లబ్ధిదారులకు బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంచడంలో కీలక పాత్ర పోషించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

2017లో ప్రారంభమైన ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనేది ఆర్థిక సంవత్సరం - 20లో లాభాలు నమోదు చేసింది. అలాగే, అప్పటి నుండి వరుసగా గత నాలుగు త్రైమాసికాలుగా ఈ బ్యాంక్ టెక్-ఎనేబుల్డ్ నెట్‌వర్క్ మోడల్ అనేది 43% కంటే ఎక్కువ వృద్ధితో ఒక్కో త్రైమాసికంలో PAT వృద్ధిని నమోదు చేస్తోంది. వ్యాపారానికి సంబంధించిన వ్యాప్తి మరియు అసెట్ లైట్ స్వభావం ఫలితంగా వ్యాపార వృద్ధి మరియు లాభదాయకత సాధ్యమైంది.

ఈ బ్యాంక్ భౌతిక నెట్‌వర్క్‌లో దాదాపు 70% వరకు గ్రామీణ/పాక్షిక పట్టణ ప్రాంతాల్లోనే ఉండడం వల్ల, ఫినో నలుమూలలకు సులభంగా విస్తరించింది. తద్వారా, తన వినియోగదారులతో పాటు ఇతర బ్యాంక్‌లకు చెందిన లక్షలాది మంది వినియోగదారులకు సులభమైన అందుబాటు మరియు సమీపంలోనే బ్యాంకింగ్ సర్వీసులు అందించింది. ప్రస్తుతం, ఈ బ్యాంక్ అసెట్ లైట్ పంపిణీ నెట్‌వర్క్ అనేది 5.5 లక్షలకు పైగా సొంత మరియు భాగస్వామ్య పాయింట్లు కలిగి ఉంది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: