మూడో రోజుతో ముగిసిన రిలే నిరాహారదీక్షలు

పండ్ల రసం అందించి విరమింప చేసిన న్యాయవాదులు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ కార్యాచరణ మేరకు బుధవారం మూడో రోజుతో దీక్షలను ముగించింది. నాంపల్లి కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో పాల్గొన్న వారికి పండ్ల రసం అందించి దీక్షను విరమింప చేశారు. చివరి కార్యక్రమం "" చలో హైదరాబాద్"" చేపట్టనున్నట్లు తెలిపారు.. ఈ నెల 9 వ తేదీన అన్ని జిల్లాలకు చెందిన న్యాయవాదులు  ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, లేని పక్షంలో నిరవధిక దీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వము వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్


చేశారు.  పార్టీలకతీతంగా న్యాయ పోరాటంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామన రావు దంపతుల కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

✍️రిపోర్టింగ్-డి.అనంతరఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: