వైస్ ఛైర్మన్ పదవి ముస్లింలకు ఇవ్వాలి

జానోజాగో సంఘం నేత సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

నంద్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్  పదవి  ముస్లిం  అభ్యర్థులకు ఇవ్వాలని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అత్యధిక ఓటర్లు ముస్లింలు ఉన్నారని ఆయన తెలిపారు. ముస్లిం జనాభా ప్రాతిపదికన నంద్యాల వైస్ చైర్మన్ గా ముస్లిం అభ్యర్థిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్ని పర్యాయాలు వైస్ చైర్మన్ గా ఇతరులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా అధికశాతం ముస్లిం సమాజానికి చెందిన వారు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. కావున నంద్యాల ఎమ్మెల్యే  ముస్లింల మనోభావాలను గౌరవించి నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా ముస్లిం అభ్యర్థిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు,

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: