వివాహిత అనుమానాస్పద మృతి 

- శవంతో అత్తింటి ఎదుట బంధువుల ధర్నా 

శవంతో బంధువుల ధర్నా 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన మనీషాకు చింతరుగువద్ద నివాసం ఉంటున్న  వ్యక్తితో 2 నెలల క్రితం వివాహం జరిగింది. మనీషాకు అమ్మానాన్న లేకపోవడంతో అవ్వ శారదమ్మ సంరక్షకులై వివాహం చేశారు. సోమవారం మనీషా అవ్వ తాతల వద్దకు వచ్చి తిరిగి భర్త ఇంటికి వెళ్లిన కొంత సేపటికే ఆత్మహత్య చేసుకున్నట్లు మనీషా భర్త, అత్తమామలు శారదమ్మకు సమాచారం అందించారు. వెంటనే వెళ్లి చూడగా మనీషా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మాకు న్యాయం జరగాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మనీషా అవ్వ శారదమ్మ, బంధువులు పోలీసులను కోరారు. మాకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని  శవంతో పాటు ధర్నా నిర్వహించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

 అనుమానాస్పద మృతి చెందిన వివాహిత 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: