ఇలాంటి కలెక్టర్ ను చూసుండరు

చెప్పుల్లేకుండా..మండుటెండలో కలెక్టర్‌ మట్టి పని

ఏప్రిల్‌ 1 నుంచి కూలీలకు మజ్జిగ

కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం

(జానోజాగో వెబ్ న్యూస్-అనంతపురం ప్రతినిధి)

ఉపాధి కూలీలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మజ్జిగ పంపిణీకి చర్యలు చేపడతామని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు మండలంలోని వడ్డుపల్లి గ్రామం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చెప్పులేసుకోకుండా మండుటెండలో గడ్డపార చేతపట్టి మట్టి తవ్వతూ కూలీల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన కలెక్టర్‌ రోజు పనులు కల్పిస్తున్నారా..? క్రమం తప్పకుండా డబ్బులు అందుతున్నాయా..? అని కూలీలను ఆరా తీశారు. తాము అడిగిన వెంటనే అధికారులు పనులు కల్పిస్తున్నారని, ఈరోజు(మంగళవారం) రూ.234పైగా కూలి పడిందని కూలీలు తెలపగా.. కలెక్టర్‌కు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామాంజనేయులును అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనులు చేసే ప్రాంతాల్లో కోవిడ్‌ నిబంధనలన్నీ పాటించేలా చూడాలన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 2.66 కోట్ల మంది కూలీలకు ఉపాధి హామీ కింద పనులు కల్పించామన్నారు. రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వేతనం కూలీలకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, ఏపీడీ నీలిమారెడ్డి, ఎంపీడీఓ రామాంజనేయులు, ఏపీఓ సుజాత పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: