తెలంగాణ లోని అన్ని కోర్టుల ముందు..

రిలే నిరాహారదీక్షలు

రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ 

మేడ్చల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైకోర్టు న్యాయ వాది గట్టు వామన రావు, నాగమణి దంపతుల హత్యను ఖండిస్తూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపు మేరకు సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మహిళా న్యాయవాదులు సైతం దీక్షకు మద్దతు ప్రకటించారు. న్యాయ వాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేసేంతవరకు తెలంగాణ వ్యాప్తంగా పోరాటాలు ఆగేదిలేదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నడిరోడ్డుపై జంట హత్య జరిగినా ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది అని అన్నారు.

కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేపట్టాలని సూచించారు. కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ కోర్టుకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి తో పాటు ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: