భారత్ బందుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతల మోహన్ రావు

మాట్లాడుతున్న పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

బిజెపి చేపడుతున్న ప్రజా వ్యతిరేక  నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఢిల్లీ రైతు ఉద్యమానికి బాసటగా రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భారత బందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నంద్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ చింతల మోహన్ రావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు, కార్మిక  సంఘాల పిలుపును గౌరవిస్తూ నంద్యాలలో  నిర్వహించే బందుకు కాంగ్రెస్ పార్టీ తమ  సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, అలాగే  భవిష్యత్తులో కూడా ఏ వర్గం ప్రజలు  ఇబ్బందుల్లో ఉన్న వారి తరపున కాంగ్రెస్ పార్టీ  అండగా పోరాటం చేస్తుందని, ఈ దేశవ్యాప్త  సమ్మెతో అయినా బిజెపి మూడు వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 

ఈ కార్యక్రమంలో  పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ఈ దేశం ఎంతో నష్టపోతుందని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేట్ పరం చేయడాన్ని విరమించుకోవాలని గత రెండు రోజుల క్రితం నంద్యాలలో జరిగిన ఈ దాడుల పట్ల ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి కక్షసాధింపు పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సేవ దళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలు అన్నిటిని కూడా ప్రైవేటు పరం చేస్తూ అన్ని రంగాల్లో కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ పోతున్న బిజెపికి ప్రజలు త్వరగా తొందరలో బుద్ధి చెప్తారు అని చెప్పి వాపోయారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు, సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి కృష్ణ, పసుపుల అజయ్ కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: