ఆ యువకిశోరాలకు సన్మానం

తమ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చారని ప్రముఖుల ప్రశంస

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం ఖ్యాతిని పెంచిన యువకిశోరాలకు పట్టణ పుర ప్రముఖులు సన్మానించారు. ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన రినౌన్డ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల లో హిందూపురం వాసి విశ్రాంత ఈ ఎస్ ఐ కార్యాలయం మేనేజర్ సయ్యద్ ఉబేదుల్లా కుమారుడు సయ్యద్ అబ్దుల్ లతీఫ్ బెంగళూరు లోని ఎం ఎస్ రామయ్య యూనివర్సిటీలో ఎం ఎస్ సీ మొదటి ర్యాంకు బంగారు పతకం.ఎం ఎస్ సీ ప్రాజెక్టు వెండి పథకం సాధించాడు. రెండవ విద్యార్థి   అంతర్జాతీయంగా భారత దేశ ఖ్యాతిని పెంచిన హిందూపురం పట్టణానికి చెందిన అబ్దుల్ రహమాన్. ఇక్బాల్ సేట్ కుమారుడు 11 ఏళ్ల  అబ్దుల్ రెహమాన్ సేట్ నేపాల్ ఇండో ఇంటర్నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్లో 500 మీటర్ల స్కేటింగ్లో భారత దేశానికి బంగారు పతకం సాధించాడు. ఈ నెల 24 నుండి 28 వరకు నేపాల్ లోని పోఖరా లో జరిగిన ఇండో ఇంటర్నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ నందు బంగారు పథకం సాధించాడు. వీరిద్దరి కీ పట్టణ ప్రముఖులు ప్రశంసిస్తూ దుశ్శాలువతో సత్కరించారు.
అనంతరం పుర ప్రముఖులు మాట్లాడుతూ తల్లి తండ్రులు పిల్లల చదువులతో పాటు క్రమశిక్షణ క్రీడల్లో నైపుణ్యతకు ప్రయత్నం చేస్తే దేశభవిష్యత్తు తీర్చదిద్దే మహనీయులు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు. జస్టిస్ వెంకటాచలయ్య.ఇలియాజ్ సేట్ లా హిందూపురం పేరును దేశ నలుమూలలా ఖ్యాతి తెచ్చిన వారి కోవకు చెందేలా  ప్రయతించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా .పురప్రముఖులు వాస్తు ఆచార్యులు బూడిద గడ్డపల్లి అశ్వత్థ నారాయణ స్వామి.డాక్టర్ అఫ్తాబ్.ఎస్డీజీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్రకుమార్. లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్.మౌలానా రిజా ఉర్ రహమాన్.మౌలానా ముఖ్తియార్. మౌలానా తoజీల్.ఆడిటర్ జబీఉల్లా.రహమతుల్లా సేట్.జామియా వైస్ ముతవల్లీ అస్లామ్ షేఖ్.స్కెటింగ్ కోచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ప్రశంసించారు రినోన్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముస్తఫా ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. 


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: