పాపులర్ ఫ్రంట్ నాయకుల ఇళ్ళ పై..

ఈడీ  దాడులకు నిరసన గా ధర్నా 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నిన్న నంద్యాల పాపులర్ ఫ్రంట్ నాయకులపై ఈడీ దాడులను నిరసిస్తూ స్థానిక గాంధీ చౌక్ నందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాపులర్ ఫ్రంట్ డివిజన్ ప్రెసిడెంట్ ఫాజీల్ దేశాయ్, కార్యదర్శి ఇద్రిస్ షేక్, అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇక్బాల్ బాషా,కార్యదర్శి అబు బకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఫాజీల్ దేశాయ్ మాట్లాడుతూ నంద్యాలలో గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారి ఇళ్లలో ఈడీ సోదాలు అని మీడియాలో ప్రసారమైన వార్తలు అబద్ధం అని తెలుపుతూ వారు  విదేశాలకు ఒక్కసారి కూడా వెళ్ళలేదని తెలిపారు.2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో   ఒక్కొక్కటిగా బీజేపీ పార్టీకి, ఆర్.యస్.యస్,  మోడీకి అతి సన్నిహితులైన వారిని అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టారన్నారు. బీజేపీ పార్టీని వ్యతిరేకించే వారిని గుర్తించి వారిపై అసత్య అభియోగాలు మోపి, వారిని హింసించి, అక్రమ కేసులు నమోదు చేసి, వారిని జైల్లో మగ్గేలా చేయాలని బీజేపీ ప్లాన్ అన్నారు. ఇక్బాల్ బాషా మాట్లాడుతూ 

మన రాష్ట్రంలోనే వందల కోట్ల రూపాయల అవినీతి చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు బీజేపీ కండువా కప్పుకోగానే వారిపై ఉన్న అక్రమ, అవినీతి కేసుల నుండి వారికి ఊరట లభిస్తుందని, ఈ రెండు పనులు చెయ్యకుండా వారికి లొంగకుండా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడే సంస్థలను, పార్టీలను, వ్యక్తులను, భావజాలాన్ని  బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిన ఈ ప్రభుత్వ రంగ సంస్థలు వారిని అతిదారుణంగా హింసిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపులర్ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: