అభివృద్ధిచేసి ఆదర్శంగా నిలవండి

వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు సన్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలవాలని శ్రీ వాసవీ యువసేన సమితి అధ్యక్షులు, ప్రముఖ బిల్డర్ పబ్బతి వేణు అన్నారు. శ్రీనివాసనగర్ లోని  శ్రీ వాసవీ యువసేన సమితి కార్యాలయంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు ఖండే శ్యామ్ సుందర్ లాల్, కాల్వ సరస్వతి, పసుపుల నారాయణమ్మలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో నలుగురు ఎన్నిక కావడం సంతోషంగా ఉందని, పట్టణాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలవాలన్నారు.

 
సమితి ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాల్లో నిర్వహించామని, మీ సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతరం వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో గెలుపొందామని, పట్టణ అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్యవైశ్యులు సేవాకార్యక్రమాల్లో ముందుంటారని, సంఘటితంగా ఉంటే ఏదైనా సాదించవచ్చన్నారు. మన భయమే మనకు శత్రువుని, ఎన్నికల్లో ఓటింగుకు రావాలని అన్నారు. ఆర్యవైశ్యులు మేధావులు, ఓటు శక్తితో సత్తా నిరూపించుకోవాలన్నారు. ఆర్యవైశ్యులకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి,ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాండురంగయ్య, పసుపుల శ్రీరాములయ్య, బిల్డర్ సత్యమయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: