అటహాసంగా మార్కాపురం,,,

మున్సిపల్ ఛైర్మన్..వైస్ ఛైర్మన్ ఎన్నిక

ఛైర్మన్ గా చిర్లంచర్ల మురళీకృష్ణ

వైస్ ఛైర్మన్ గా షేక్. ఇస్మాయిల్ 

ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు-కమిషనర్ నయీమ్ అహమ్మద్


మునిసిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాల మురళీకృష్ణ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కపురం ప్రతినిధి)

మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పర్యావేక్షణలో మునిసిపల్ కమీషనర్ నయీమ్ అహమ్మద్ ఆధ్వర్యంలో మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరిగాయి.  మార్కాపురం మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉండగా. ఐదు వార్డలు వైసీపీకి ఏకగ్రీవమైనవి, ఎన్నికలు జరిగినవి 30 వార్డుల్లో 3,4,6,7,8,9,11,12,13,16,17,18,19,22,23,25,27,28,29,30,31...వార్డులు గెలవగా టీడీపీ 2, 26,34 ,33, 35 లను గెలుచుకొంది. ఈ నేపథ‌యంలో గురువారంనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అత్యంత మెజారిటీతో గెలుపొందిన 6వ వార్డు అభ్యర్ధి చిర్లంచర్ల మురళీకృష్ణ మునిసిపల్ ఛైర్మన్ గాను వైస్ ఛైర్మన్  17వ వార్డులో గెలుపొందిన షేక్. ఇస్మాయిల్ ఎన్నికయ్యారు. ఎన్నికయిన వారినందరి చేత  ప్రత్యేక అధికారి సరళా వందనం ప్రమాణ స్వీకారం చేయించి, శుభాకాంక్షలు తెలియచేశారు. 


 

 ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి

ఈ సందర్భంగా చిర్లంచర్ల కృష్ణ మాట్లాడుతూ ముఖ్యంగా మన ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి పూర్తి సహాయసహకారాలతో  పాటు నా విజయానికి కారణమైన ఆర్యవైశ్య సంఘం వారికి, ప్రధమ శ్రేణి నాయకులు,  ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నాపై నమ్మకముంచి నావిజయానికి సహకరించిన నా వార్డు ప్రజలందరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియచేశారు. ఇదే విధంగా నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి వారికి న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమము ఇంత విజయవంతంగా జరుపుకునేందుకు సహకరించిన  పురపాలక సిబ్బందిని మరియు పాల్గోన్న అందరికి పేరుపేరున కమీషనర్  నయీమ్ అహమ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. 

 మునిసిపల్ వైస్ ఛైర్మన్ షేక్. ఇస్మాయిల్

 మార్కాపురం మునిసిపల్ కమీషనర్ నయీమ్ అహమ్మద్

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్ 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


         

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: