ఖ‌మ్మం షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి,,

హైద‌రాబాద్ చేరుకున్న‌ `ఆచార్య`

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్ ఫుల్ మెగా ఎంట‌ర్ టైన‌ర్ `ఆచార్య`‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో  కాజ‌ల్ - పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ - కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్ రెడ్డి- రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లు. ఇటీవ‌ల ఖ‌మ్మం షెడ్యూల్ తో చిత్ర‌బృందం బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి- రామ్ చ‌రణ్ పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ-``ఖ‌మ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హ‌ద‌రాబాద్ లో అడుగుపెట్టాం. చిరంజీవి -చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించాం`` అని తెలిపారు. ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: