పెద్ద కంబాలూరు గ్రామ సమస్యలను...

పట్టించుకోని రెవిన్యూ అధికారులు

 సీపీఐ నేతల విమర్శ

13 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన సీపీఐ-ప్రజా సంఘాల నాయకులు

(జానోజాగో వెబ్ న్యూస్-ఆళ్లగడ్డ ప్రతినిధి)

పెద్ద కంబాలూరు గ్రామ సమస్యలు పరిష్కరించని అధికారుల తీరును నిరసిస్తూ సీపీఐ నాయకులు,విద్యార్థులు పెద్ద కంబాలూరు నుండి రుద్రవరం కార్యాలయం వరకు 13 కిలో మీటర్లు మండుటెండలో  పాదయాత్ర  చేసి రుద్రవరం  ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం రుద్రవరం ఎమ్మార్వో కు సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సీపీఐ ఆళ్లగడ్డ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్,రైతు సంఘం కార్యదర్శి నరసింహులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు లు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ ఆళ్లగడ్డ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్,రైతు సంఘం కార్యదర్శి నరసింహులు,ఏఐఎస్ఎఫ్  జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు మాట్లాడుతూ
పెద్ద కంబాలూరు గ్రామంలో ఉన్న 11 సెంట్ల స్థలం ఆక్రమణకు గురి అయ్యిందని,ఆ గ్రామ హైస్కూల్ కు సంబంధించిన 2 ఎకరాల భూమి కూడా అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేసారాని,స్థలం లేక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఎండలో పెడుతున్నారని,స్కూల్ కు వెళ్ళడానికి రోడ్ మార్గం కూడా లేదని అంతే కాకుండా ఇంకా పెద్ద కంబాలూరు గ్రామంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని పెద్ద కంబాలూరు గ్రామ ప్రజలు,సీపీఐ నాయకులు రుద్రవరం మండల రెవిన్యూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అందుకు నిరసనగానే ఈ రోజు పెద్దకంబాలూరు నుండి 13 కిలోమీటర్లు ఎండను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు,ప్రజలతో కలిసి సీపీఐ నాయకత్వం పాదయాత్ర నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు.ఇప్పటికయినా అధికారులు స్పందించి పెద్ద కంబాలూరు గ్రామ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించడానికి కూడా,నిరాహారదీక్షలకు కూడా వెనకడుగు వెయ్యమని వారు అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ వెంకటపతి,చంద్రామాని,వేకటేశ్వర్లు,రాజన్న,బాలవర్తి రాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు,దళిత సమాఖ్య మండల అధ్యక్షుడు గుర్రప్ప లు పాల్గొన్నారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: