నడక పోటీలో పాల్గొన్న మహిళా జడ్జి

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటల పోటీలు

పోటీలలో పాల్గోన్న కోర్టు సిబ్బంది, న్యాయ వాదులు


(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో రెండవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీత పాల్గొన్నారు. న్యాయమూర్తిగా భాద్యతలు నిర్వహిస్తూ పోటీలలో కూడా పాల్గొని ఆదర్శంగా నిలిచారు. ప్రతీ ఒక్కరూ విధిగా పాల్గొనేందుకు ప్రేరణగా నిలిచారు. అన్నింటిలోనూ సమానంగా నిలుస్తున్న మహిళల పాత్ర గణనీయంగా ఉందనడంలో సందేహములేదు. ఈ పోటీలలో మహిళా న్యాయ వాదులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఇటుకల మీద నడక పోటీ ఆసక్తికరంగా కొనసాగింది. కాలు కింద పెట్టకుండా ఇటుకల పై నడవం అందరినీ ఆకర్షించింది.

క్రీడా స్ఫూర్తితో మహిళలందరూ ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి మహిళా దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తారు. ఈ నెల 8 వ తేదీ వరకు మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. వారోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు మహిళా న్యాయవాదులు విశేషంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కోర్టు సిబ్బంది సైతం పోటీలలో పాల్గొని అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


 

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

    

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: