బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు

డీసీసీ అధ్యక్షులు-  జె లక్ష్మీ నరసింహ యాదవ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని నంద్యాల పార్లమెంట్ జిల్లా  కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఎన్ఆర్సి విషయంలో వైఎస్సార్సీపీ, టిడిపి పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బిజెపికి జైకొట్టి గల్లీలో మైనారిటీలకు మద్దతిస్తున్నట్లుగా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన ఫామ్ బి, ఫామ్ ఏ లను అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే,  వారి అనుచరులు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న  ఎన్నికలలో నీతి నిజాయితీగా పోటీచేసి గెలిచి విశ్వసనీయత చూపించాలి గానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బెదిరింపులు  చేస్తూ విత్ డ్రా అయ్యే విధంగా వారిని మభ్యపెట్టడం, బెదిరించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉంటానన్నారు. రాష్ట్రంలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని, మూడొందలకు పైగా స్థానాలు వార్డు మెంబర్ లు  గెలిచాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని కాంగ్రెస్ పార్టీ జెండా అధికారపార్టీ గుండెల్లో దడ పుట్టిస్తోందని తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి  పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ రెండు సంవత్సరాలలో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. పెళ్లి కానుక కింద ఈ రాష్ట్రంలో ఒక్క జంటకైనా ముస్లిం మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు, బిసిలకు గానీ ఏ ఒక్కరికైనా పెళ్లి కానుక అందజేశాడా అని ప్రశ్నించారు. ఒకవేళ అందజేస్తుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి   మిగిలిపోయాడని, బీసీలందరూ ఆలోచించుకొని ఓటు వేసే ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. నంద్యాల పట్టణంలో అభివృద్ధి జరిగినా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మాత్రమే అని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం రావాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.ఎన్ఆర్సి   విషయంలో వైఎస్సార్సీపి, టిడిపి పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బిజెపికి జైకొట్టి గల్లీలో మైనారిటీలకు మద్దతిస్తున్నట్లుగా నాటకాలాడుతున్నారని ఆరోపించారు. దేశంలోనూ,  రాష్ట్రంలోనూ ప్రశ్నించే గొంతులు లేకపోవడం వల్ల అధికార పార్టీ  నాయకులు పేద ప్రజల జీవితాలను చిన్నా భిన్నం చేస్తూ వారి జీవితాలతో ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారిందని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చినట్టుగా  గ్యాస్ ధర వెయ్యికి, పెట్రోల్, డీజిల్ ధర సెంచరీ కొట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలు వచ్చినట్లుగా    సామాన్య ప్రజలు ఏమీ కొనేటట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాకిన రైతు ఉద్యమాలను లెక్కచేయకుండా ఎనభై  రోజుల నుంచి చేస్తున్న ఉద్యమాలను పట్టించుకోకుండా మోడీ కళ్లు ఉండి కూడా చూడలేని కబోదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పిచ్చి తుగ్లక్ పాలనకు మద్దతుగా ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జైకొడుతూ మద్దతు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.  ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, టిడిపి,  జనసేన ఏ ఒక్కరికి ఓటు వేసిన బిజెపికి ఓటు వేసినట్లేనని గుర్తుచేశారు. కేంద్రంలో బిజెపి పార్టీ పాలనను తలదన్నేలా రాష్ట్రంలో అంతకుమించి అరాచక పాలన వైస్సార్సీపీ పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం పూర్తిగా అమలు కాక అట్టర్ ఫ్లాప్   అయిందని తెలిపారు.  ఎన్నికల ముందు పాదయాత్రలో సోనా మసూరి సన్నబియ్యం ఇస్తామని చెప్పి నేడు స్వర్ణ రకం మధ్యస్థ బియ్యం పేరుతో పంపిణీ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డోర్ డెలివరీ కూడా పూర్తిగా విఫలమైందని ఎనభై శాతం ప్రజలు డోర్ డెలివరీ వద్దు మేమే తెచ్చుకుంటామని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అతిముఖ్యమైన పథకం ఫీజు రీయంబర్స్మెంట్ పథకమని, నేడు తనయుడు తండ్రి బాటలో నడుస్తానని చెప్పి ఫీజు రీయంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ జీవో నెంబర్  77 ను తీసుకువచ్చి పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు పీజీ విద్యను దూరం చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని ఎద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూలీ పని చేసుకునే ప్రజల పిల్లలందరూ ఉన్నతవిద్యను చదివితే  నేడు డిగ్రీ అయిపోయాక పీజీ చదవాల్సిన   విద్యార్థులందరూ కూలి పనులు చేస్తున్నారని తెలిపారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీకి లక్ష్మీ నరసింహ యాదవ్ దేశంలోగానీ, రాష్ట్రంలో గానీ ఏ దేవాలయానికైనా కూడా నిధులు  కేటాయించి అభివృద్ధి చేస్తుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకుండా మతం పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం బిజెపి వారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలోగానీ,  రాష్ట్రంలోగానీ ఏ దేవాలయాల మీద కూడా దాడులు జరగలేదని గుర్తు చేశారు. నంద్యాల పట్టణంలో దేవస్థానాలు శ్రీశైలం, మహానంది,  యాగంటి అహోబిలం లాంటి ప్రముఖ దేవస్థానాలు అభివృద్ధి చెందాయంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేనని గుర్తు చేశారు. ప్రజలందరూ నగరం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో, దేశంలో అరాచక పాలనను ప్రశ్నించాలన్న ప్రశ్నించే గొంతులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నగరాభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్, అబ్దుల్లా,  ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: